చెంపలపై పుట్టుమచ్చలు ఉంటే మంచిదేనా?

మనలో పుట్టు మచ్చలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అయితే కొన్ని పుట్టుమచ్చలను అదృష్టంగా భావిస్తారు. కొన్నింటిని అశుభంగా భావిస్తారు. మరి చెంపపై పుట్టుమచ్చ ఉండటం శుభమా? అశుభమా? అనేది తెలుసుకుందాం పదండి.
 

moles

దాదాపుగా ప్రతివ్యక్తికీ శరీరంలో ఏదో ఒక భాగంలో పుట్టుమచ్చలు ఉంటాయి. సముద్ర శాస్త్రం ప్రకారం.. ఈ పుట్టుమచ్చలు మనకు మంచి, చెడు సంకేతాలను ఇస్తాయి. ఇలాంటి పరిస్థితిలో.. మీ బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే ఏం జరుగుతుంది? ఇది మంచిదా? కాదా? అన్న విషయాన్ని తెలుసుకుందాం పదండి. 

moles

ఎడమ చెంపపై పుట్టుమచ్చ

కొంతమందికి మీ ఎడమ బుగ్గపై పుట్టుమచ్చ ఉంటుంది. ఈ భాగంలో పుట్టు మచ్చ ఉన్నవారు చాలా కష్టపడి పనిచేస్తారని జ్యోతిష్యం చెబుతుంది. అలాగే వీరు చాలా  క్రమశిక్షణతో కూడా ఉంటారు. 
 


జీవితంలో విజయం

ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉన్నవారు తమ కృషి వల్ల జీవితంలో ఎన్నో విజయాలను సాధిస్తారు. ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కానీ వీరి దగ్గర డబ్బు ఉండదు. వీరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. 

డబ్బు నిలవదు.

ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉండటం మంచిదే. వీరి దయ స్వభావం కారణంగా వీళ్లు డబ్బును కూడబెట్టలేకపోతారని జ్యోతిష్యం చెబుతుంది. వీరు డబ్బుకు పోగొయ్యరు.

కుడి చెంపపై పుట్టుమచ్చ

మీ కుడి చెంపపై పుట్టుమచ్చ ఉండే వ్యక్తులను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. వీరికి ఎప్పుడూ కూడా డబ్బుకు కొదవే ఉండదు. అలాగే వీరి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. 
 

moles

చాలా డబ్బును సంపాదిస్తారు 

కుడి చెంపపై పుట్టుమచ్చ ఉన్నవారు వివాహానంతరం చాలా మంచి జీవితాన్ని గడుపుతూ ఎక్కువ డబ్బు సంపాదించడం ప్రారంభిస్తారు. అలాంటి వారు చాలా కష్టపడి పనిచేస్తారు. అలాగే వీళ్లు చాలా తెలివైనవారు కూడా.
 

రెండు బుగ్గలపై పుట్టుమచ్చ

మీకు రెండు బుగ్గలపై పుట్టుమచ్చలు ఉంటే మీరు ఏదైనా పని చేయాలని నిర్ణయించుకుంటే.. దానిని పూర్తి చేసేదాక కదలరు. అలాంటి వారు సరైన మార్గంలో నడవడానికి, కష్టపడి పనిచేయడానికి ఇష్టపడతారు.

స్వతంత్రంగా ఆలోచించడం

రెండు బుగ్గలపై పుట్టుమచ్చలు ఉన్నవారు స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉంటారు. అలాగే వీరి పనిలో ఎక్కువ పరిమితిని ఇష్టపడరు. వీళ్లు ఎప్పుడూ కూడా ఈ ప్రపంచానికి భిన్నంగా ఏదైనా చేయాలనుకుంటారు.

Latest Videos

click me!