ఏ దిక్కున కూర్చొని తింటే మంచిదో తెలుసా?

First Published | Aug 13, 2024, 1:22 PM IST

వాస్తు శాస్త్రం ప్రకారం.. అన్ని పనులను చేస్తే ఇంట్లో అంతా సవ్యంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. కాబట్టి ఏ దిక్కున కూర్చొని తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

వాస్తు శాస్త్రానికి హిందూమతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రంలో మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. వీటిని అనుసరిస్తే జీవితంలో కష్టాలనేవే ఉండవంటారు జ్యోతిష్యులు. ఇలాంటి వాటిలో మనం తినే విధానం ఒకటి.


ఒక్కొక్కరు ఒక్కోలా తింటుంటారు. తినడానికి ఎన్నో పద్దతులు ఉన్నాయి. అయితే వాస్తు శాస్త్రం మాత్రం.. ఏ దిశలో కూర్చొని తింటే మంచిది? ఏ దిక్కున కూర్చొని తినకూడదో వివరిస్తోంది. అసలు వాస్తు శాస్త్రం ప్రకారం.. ఏ దిశలో కూర్చుని అన్నం తినాలో ఇప్పుడు  తెలుసుకుందాం పదండి. 

Latest Videos


తూర్పు దిక్కు

తూర్పు దిక్కును ఇంద్రుని దిక్కుగా భావిస్తారు. అంటే ఈ దిశ చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ దిశలో గనుక మీరు కూర్చొని తింటే మీ ఆయుష్షు పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అంతేకాదు ఈ దిక్కులో కూర్చొని తినడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. చదువులో కూడా ముందుంటారు. 

పడమటి దిక్కు

పడమటి దిక్కు ఎంతో శుభప్రదం. ఎందుకంటే ఈ పడమటి దిక్కు లక్ష్మీ దేవి దిక్కుగా భావిస్తారు. కాబట్టి మీరు ఈ దిశలో కూర్చొని అన్నం తింటే మీ ఇంట్లో సిరి, సంపదలు పెరుగుతాయి. అలాగే మీరు చేపట్టిన వ్యాపారం కూడా బాగా వృద్ధి చెందుతుంది. 

దక్షిణ దిక్కు

దక్షిణ దిక్కు కూడా చాలా మంచిది. ఎందుకంటే దక్షిణం యముడి దిశలో అధిరోహిస్తున్నందున.. ఈ దిశలో కూర్చోవడం వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. మీరు తూర్పు, పడమటి దిక్కులోనే కాకుండా.. దక్షిణ దిశలో కూర్చొని కూడా తినొచ్చు. 
 

ఉత్తర దిక్కు

ఉత్తర దిక్కు శివుని దిక్కు. కాబట్టి మీరు  ఉత్తరం దిక్కు లో కూర్చొని తినడం మానుకోండి. ఎందుకంటే ఈ దిశలో కూర్చొని తింటే సర్వ రోగాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఇది మీ రిలేషన్ షిప్ ను కూడా నాశనం చేస్తుంది. 

click me!