కెరీర్ లో సక్సెస్ అవ్వాలంటే.. ఈ చాణక్య నీతి ఫాలో అవ్వాల్సిందే..!

First Published | Aug 12, 2024, 4:49 PM IST

చాణక్య నీతి.. మానవ జీవితానికి అవసరయ్యే చాలా విషయాలను వివరిస్తుంది. అందుకే.. ఆయన నియమాలను ప్రజలు ఇప్పటికీ అనుసరిస్తూ ఉంటారు. 

Chanakya Niti

చాణక్యుడు ఆర్థిక శాస్త్రాన్ని మాత్రమే కాదు...జీవితంలో ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో కూడా స్పష్టంగా ముందే చెప్పారు. మరి.. చాణక్య నీతి ప్రకారం ఓ వ్యక్తి.. కెరీర్ లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
 

Chanakya Niti

చాణక్య నీతి.. మానవ జీవితానికి అవసరయ్యే చాలా విషయాలను వివరిస్తుంది. అందుకే.. ఆయన నియమాలను ప్రజలు ఇప్పటికీ అనుసరిస్తూ ఉంటారు. కాగా.. మనిషి విజయం సాధించాలి అంటే... పక్షులు, జంతువులను ఫాలో అయితే సరిపోతుంది అని చెబుతున్నారు.
 


కాకులు


కాకి చాలా తెలివైన పక్షి అని చాణక్యుడు  చెబుతున్నాడు. అందుకే కాకి నుంచి మనిషి కొన్ని విషయాలు తెలుసుకోవాలట. కాకి తన ఆహారం కోసం చాలా సార్లు ప్రయత్నాలు చేస్తుంది. ఫుడ్ కనపడానికి అక్కడికి వెళ్లినప్పుడు ఎవరైనా వాటిని వెళ్లగొట్టినా కూడా.. మళ్లీ, మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. తనకు ఫుడ్ దొరికే వరకు అక్కడే ఉండి మరీ ఫుడ్ దక్కించుకుంటుందట. కొంచెం కూడా భయపడకుండా తన ప్రయత్నం విజయంతమయ్యేలా చేస్తుంది. కాకిని చూసి మనం కూడా ఏదైనా పని మొదలుపెడితే.. విజయం దక్కే వరకు ప్రయత్నించడం నేర్చుకోవాలి అని చాణక్యుడు చెబుతున్నాడు.

ఇక కుక్కలు కొంత ఆహారం దొరికినా తృప్తి చెందుతాయి.  నిజానికి కుక్కలు చాలా ఎక్కువ ఆహారం తినగల సామర్థ్యాన్నికలిగి ఉంటాయట. అంతేకాకుండా.. తమకు ఆహారంపెట్టే యజమానిని జాగ్రత్తగా చూసుకోవడం, ప్రేమ పంచడంలో ముందుంటాయి. ఈ లక్షణాన్ని మనం కుక్కల నుంచి నేర్చుకోవాలట. మనకు సహాయం చేసిన వారి పట్ల కృతజ్నత, విశ్వాసం చూపించాలి. 

rooster

కోడి పుంజు నుంచి కూడా మనిషి చాలా విషయాలు నేర్చుకోవ్చని చాణక్యుడు చెబుతున్నాడు. ఇవి సూర్యోదయానికి ముందే నిద్రలేస్తాయి. తమ ఆహారాన్ని ఇతర కోళ్లతో పంచుకుంటాయి. అవసరం వస్తే పోటీకూడా పడతాయి. అదేవిధంగా మనిషి కూడా తమ హక్కుల కోసం పోరాటం చేయడంలో ఎలాంటి తప్పులేదని చాణక్యుడు చెబుతున్నాడు.

అడవికి రాజు సింహం. ఈ సింహాన్నే అడవికి రాజు అని ఎందుకు అన్నారు అంటే.. దానికి ఎంత పెద్ద టాస్క్ ఇచ్చినా దాని ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ప్రయత్నించి మరీ విజయం సాధిస్తుంది. అందుకే..సింహాన్ని చూసి ప్రజలు కూడా ఈ లక్షణాన్ని నేర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చేయాల్సిన పనిని చేయడం నేర్చుకోవాలి అని చాణక్యుడు చెబుతున్నాడు.

Latest Videos

click me!