Elephant Statue: వాస్తు శాస్త్రంలో తెల్ల ఏనుగుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇది శుభానికి, స్థిరత్వానికి చిహ్నంగా చెబుతారు. సరైన దిశలో తెల్ల ఏనుగు విగ్రహం పెట్టుకుంటే ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది.
ఏనుగును వినాయకుడి రూపంగా కొలుస్తారు. విఘ్నాలను తొలగించేది వినాయకుడు. అతని అనుగ్రహం ఉంటే చాలు… జీవితం అద్భుతంగా ఉంటుంది. ఏనుగు ముఖం, రూపం, తెలివి, విజయం, కొత్త అవకాశాలకు సంకేతంగా నిలుస్తుందని చెప్పుకుంటారు. దేవతలకు రాజు ఇంద్రుడు. ఇతని వాహనం తెల్ల ఏనుగు ఐరావతం. ఐరావతం ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు వెల్లి విరుస్తాయి. అందుకే తెల్ల ఏనుగును ఇంట్లో పెట్టుకుంటే జీవితంలో ఎలాంటి కష్టాలు రావు.
24
తెల్ల ఏనుగును పెట్టుకుంటేనే మంచిది
వాస్తు శాస్త్రం ప్రకారం తెల్ల ఏనుగు ఇంట్లో పెట్టుకోవాలి. దాన్ని ఇంట్లోని ఉత్తరం లేదా ఈశాన్య దిశలో పెట్టడం శుభప్రదంగా చెప్పుకుంటారు. ప్రధాన ద్వారం వద్ద లోపలికి చూస్తున్నట్లుగా ఓ జత ఏనుగులను పెడితే రక్షణ లభిస్తుంది. అలాగే సంపద కూడా పెరుగుతుంది. ఇక పడకగదిలో తెల్ల ఏనుగు విగ్రహాన్ని పెట్టుకుంటే సంబంధాల్లో నమ్మకం, సమతుల్యం పెరుగుతాయని అంటారు. అదే ఆఫీసులో పెట్టుకుంటే నాయకత్వ లక్షణాలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం బలపడతాయి. దీనివల్ల జీవితంలో అందంగా సాగుతుంది.
34
ఎత్తిన తొండం
ఏనుగును పైకి ఎత్తిన తొండంతో ఉన్నది తీసుకుంటే మంచిది. ఇలాంటి ఏనుగు ఇంట్లో పెట్టుకుంటే విజయం, పురోగతి దక్కుతుంది. అదే కిందకు ఉన్న తొండంతో ఏనుగును తీసుకుంటే అది ఇంట్లో ఆర్ధిక స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఐశ్వర్యం కోసం, పైకి ఎత్తిన తొండం ఉన్న ఏనుగును మరింత శుభప్రదంగా భావిస్తారు.
ఏనుగు విగ్రహాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విరిగిన లేదా పాడైన విగ్రహాన్ని ఇంట్లో పెట్టకూడదు. పరిమాణం కూడా మధ్యస్థంగా ఉన్నది ఎంపిక చేసుకోవాలి. మరీ చిన్నది కాకుండా, మరీ పెద్దది కాకుండా ఉంటే మంచిది. విగ్రహాన్ని ఎప్పుడూ శుభ్రంగా, దుమ్ము లేకుండా చూసుకోవాలి. గౌరవించాలి. సరైన దిశలో పెట్టిన తెల్ల ఏనుగు ఇంట్లో శాంతి, సౌభాగ్యాలకు ప్రతీకగా నిలుస్తుంది.