మిథున రాశికి అస్సలు సెట్ అవ్వని రాశుల్లో వృశ్చికం మొదటిది. వృశ్చిక రాశి వారు బంధంలో చాలా డిమాండింగ్‌గా ఉంటారు, ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు. వాళ్ల రహస్య స్వభావం, అతి ప్రేమతో మిథున రాశి వారికి ఊపిరాడనట్లు అనిపిస్తుంది. మిథున రాశి వారు బాగా మాట్లాడితే, వృశ్చిక రాశి వారు మౌనంగా ఉంటారు.
కర్కాటక రాశి వారికి కుంభ రాశి వాళ్లతో చాలా కష్టం. బంధం విషయానికి వస్తే ఇద్దరి మధ్య పొంతన ఉండదు. కర్కాటక రాశి వారికి బంధంలో భద్రత, స్థిరత్వం కావాలి. కానీ కుంభ రాశి వారికి స్వేచ్ఛ ఎక్కువ కావాలి. ఇది కర్కాటక రాశి వారిలో అనుమానాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ రాశుల వారు మంచి జంట కాలేరు.