Zodiac Sign
1.మేష రాశి..
ఈ రాశివారు ఎవరినైనా అసహ్యించుకుంటే, వారితో అసలు మాట్లాడరు. వారిని పూర్తిగా ఎవాయిడ్ చేస్తూ ఉంటారు. వారి ముఖ కవళికలు చూస్తే చాలు వారు ఆ వ్యక్తిని ఎంత అసహ్యించుకుంటున్నారో తెలుసుకోవడానికి. వెంటనే అర్థమైపోతుంది.
Zodiac Sign
2.వృషభ రాశి..
ఎవరినైనా అసహ్యించుకుంటే వారితో అసలు మాట్లాడకుండా ఉండటం, వారిని ఇగ్నోర్ చేయడం ఎలాగో వృషభ రాశివారికి బాగా తెలుసు. తమకు ఇష్టం లేనివారు తమ దగ్గరలో ఉండటాన్ని కూడా వీరు సహించలేరు.
Zodiac Sign
3.మిథున రాశి..
మిథున రాశివారు ఎవరైనా అసహ్యించుకుంటే వారిని ఏదో ఒకటి అనుకుండా ఉండలేరు. వారిని విమర్శించడం, తిట్టడం లాంటివి చేస్తారు.. విమర్శించి తమ అసహ్యాన్ని వ్యక్తపరిచేవరకు వీరికి నిద్రపట్టదు.
Zodiac Sign
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారికి తమకు ఇష్టంలేని వారు కనపడితే వెంటనే ముఖం మారిపోతుంది. అయితే ఆ ముఖాన్ని అందరికీ చూపించడం వీరికి నచ్చదు. వెంటనే ఎంత తొందరగా వీలైంతే అంత తొందరగా అక్కడి నుంచి వెళ్లిపోతారు.
Zodiac Sign
5.సింహ రాశి..
సింహ రాశివారు ఎవరినైనా అసహ్యించుకుంటే తమ ముఖ కళవికళలు, మాటలతో వెంటనే దానిని తెలియజేసేస్తారు. పదునైన మాటలతో వారిని బాధపెట్టేదాకా వదలరు.
Zodiac Sign
6.కన్య రాశి..
కన్య రాశివారు అందరిలోనూ పాజిటివిటీ వెతుకుతారు. నెగిటివిటీ ఎక్కువగా ఉండేవారికి దూరంగా ఉంటారు. తమను ఎవరూ ఇబ్బందిపెట్టే అవకాశం కూడా వీరు ఇవ్వరు. ముందుగానే దూరంగా ఉంటారు.
Zodiac Sign
7.తుల రాశి..
ఎవరైనా నచ్చకపోతే వారిని తమ జీవితం నుంచి ఈ రాశివారు దూరం చేసేస్తారు. నచ్చినవారిని జీవితంలో ఉంచుకోవాలని వీరు అనుకోరు. వారిని దూరంపెట్టి, మరో వ్యక్తికి దగ్గరౌతారు.
Zodiac Sign
8.వృశ్చిక రాశి..
ఈ రాశివారికి ఎవరైనా నచ్చకపోతే వారి ముఖం మీదే వారికి ఇష్టం లేదని, తమకు దూరంగా ఉండమని చెబుతారు. ఇంకెప్పుడూ వారితో కలవాలని కూడా అనుకోరు.
Zodiac Sign
9.ధనస్సు రాశి..
ఈ రాశివారికి ఎవరైనా నచ్చుకుంటే వారికి దూరంగా ఉంటారు. వీరికి గొడవలు పడటం కూడా పెద్దగా నచ్చదు. ప్రశాంతంగా ఉండటం ఇష్టం. ఎవరైనా నచ్చకుంటే దూరంగా ఉంటారు.
Zodiac Sign
10.మకర రాశి..
మకర రాశివారికి ఎవరైనా నచ్చకపోతే వారిని భరించాలని అనుకోరు. వారికి జీవితాంతం దూరంగా ఉండాలని అనుకుంటారు. వారికి శాశ్వతంగా గుడ్ బై చెప్పేస్తారు.
Zodiac Sign
11.కుంభ రాశి..
కుంభ రాశివారికి ఎవరైనా నచ్చకుంటే అది వారి మాటల్లోనే తెలిసిపోతుంది. కొంచెం వెటకారంగా మాట్లాడతారు, మరి కొంచెం వారి ముఖ కవళికలను బట్టి కూడా తెలిసిపోతుంది.
Zodiac Sign
12.మీన రాశి..
ఈ రాశివారు అందరికన్నా కొంచెం భిన్నంగా ఉంటారు. వీరు తమకు నచ్చకపోయినా ఆ విషయాన్ని చెప్పరు. పైకి మాత్రం వారితో శాంతియుతంగానే ఉంటారు. స్నేహంగానే మెలుగుతారు.