ప్రతి ఒక్కరికీ ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికీ భిన్న కోణాలు ఉంటాయి. అందరికీ అవి కనిపించవు. ప్రతి ఒక్కరూ తమ సానుకూలంగా ఉన్న వైపు అందరికీ చూపించాలని అనుకుంటారు. చీకటి కోణాన్నిఇతరులకు పరిచయం చేయడానికి ఇష్టపడరు. ప్రతి ఒక్కరూ అలానే ఉంటారు. కానీ ఎవరూ లేని సమయంలోనూ మనం ఎలా ఉంటాము అనేది అసలైన మనం. మరి వృశ్చిక రాశిలోని డార్క్ సైడ్ ఏంటో ఓసారి చూద్దాం..
నిజానికి వృశ్చిక రాశివారు ఎవరినైనా ఆకర్షించగల టాలెంట్ ఉంటారు. అయితే.. వీరిలో చాలా రహస్యాలు ఉంటాయి. ఈ రాశివారిలో ప్రతికూల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వాటిని బయటపడకుండా జాగ్రత్తపడుతూ ఉంటారు. ఈ రాశివారు అందరి నుంచి విధేయత కోరుకుంటారు. తమను అందరూ గౌరవించాలని అనుకుంటారు.
ఈ రాశివారు తమను ఇష్టపడేవారి కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. వంద శాతం ఇవ్వడానికి ముందుకు వస్తారు. కానీ.. వారు కూడా ప్రతి విషయంలో తమకు విధేయంగా ఉండాలని కోరుకుంటారు. దీని కారణంగానే వీరితో ఉండేవారికి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది.
ప్రతీకారం..
కొన్నిసార్లు వారి అబ్సెసివ్ ప్రవర్తన కోపం లేదా ప్రతీకారంగా మారుతుంది. మీరు వృశ్చిక రాశికి కోపం తెప్పించినా లేదా బాధపెట్టినా, శిక్ష నుండి తప్పించుకోలేరు. వృశ్చిక రాశి వారు తిరిగి కొట్టే వరకు విశ్రమించరు. వారు సరైన అవకాశం కోసం వేచి ఉంటారు. వీరు ప్రతీకారం తీర్చుకోవడంలో ముందుంటారు. ఇతరులు తమకు అన్యాయం చేసినా, బాధ పెట్టినా ప్రతీకారం తీర్చుకునే వరకు నిద్రపోరు.
ఈ రాశివారు లక్ష్యాలను పెట్టుకుంటారు. కానీ.. దానిని చేరేంతవరకు ఓపిక ఉండదు. వీరికి అసమర్థత చాలా ఎక్కువ. అసూయ కూడా ఎక్కువే. విజయ సాధించలేరు. ఓడపోవడాన్ని తట్టుకోలేరు. విజయం సాధించలేకపోతే వీరు గందరగోళానికి గురౌతారు. దీంతో అసూయకు గురౌతారు. వారిపై శత్రుత్వం పెంచుకుంటారు. ఈ క్రమంలో చాలా నష్టపోతారు. దానిని వారు తెలుసుకోలేరు.