ఈ రాశివారు కోపాన్ని ఎలా పోగొడతారో తెలుసా..?

Published : Feb 01, 2022, 10:59 AM IST

 జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక్కో రాశివారు ఈ కింది విధంగా క్షమాపణలు  చెప్పి కోపం పొగొట్టే ప్రయత్నం చేస్తుంటారట. మరి ఎలా సారీ చెబుతారో ఓసారి చూద్దామా..  

PREV
113
ఈ రాశివారు కోపాన్ని ఎలా పోగొడతారో తెలుసా..?

దంపతులు, ప్రేమికులు, స్నేహితుల మధ్య కోపతాపాలు రావడం చాలా సహజం. ఆ కోపం పొగొట్టేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మళ్లీ తమ బంధం మునుపటిలా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక్కో రాశివారు ఈ కింది విధంగా క్షమాపణలు  చెప్పి కోపం పొగొట్టే ప్రయత్నం చేస్తుంటారట. మరి ఎలా సారీ చెబుతారో ఓసారి చూద్దామా..
 

213

1.మేష రాశి..
ఎవరికైనా తమపై కోపం వస్తే మేష రాశివారు వారికి చాక్లెట్స్, పూలు, కేకులు.. లేదంటే ఏదైనా ఖరీదైన కేఫ్, రెస్టారెంట్ కి తీసుకువెళ్లడం లాంటివి చేసి క్షమాపణలు చెబుతారు. ఎదుటివారి కోపాన్ని ఇట్లే పోగడతారు.
 

313

2.వృషభ రాశి..
ఈ రాశివారు.. తమ వల్ల ఎవరైనా బాధపడినా, ఇబ్బంది పడినా, కోపం గా ఉన్నా.. వారి ముందే కూర్చొని మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తారు.  అంతేకాకుండా..  ఏదైనా ఖరీదైన బహుమతి కూడా అందిస్తారు.
 

413

3.మిథున రాశి..
ఈ రాశివారికి క్షమాపణలు చెప్పడం పెద్దగా ఇష్టం ఉండదు. తప్పు అయ్యిందని చెప్పడం కూడా వీరికి నచ్చదు. కానీ.. ఇంకోసారి మాత్రం ఇలాంటి తప్పు రిపీట్ కాకుండా జాగ్రత్త పడతారు. మరోసారి తమ కారణంగా ఎదుటి వారికి కోపం, బాధ కలగకుండా జాగ్రత్తపడతారు.
 

513

4.కర్కాటక రాశి..
ఈ రాశివారు తమ కారణంగా ఎవరికైనా బాధ కలిగితే.. ఏదైనా గ్రీటింగ్ కార్డు ఇచ్చి క్షమాపణలు చెబుతారు. ఆ  కార్డు కూడా కలర్ ఫుల్ గా ఉండేలా.. అంతేకాకుండా.. హార్ట్స్ ఉండేలా చూసుకుంటారు.

613

5.సింహ రాశి..
ఈ రాశివారు.. తమ కారణంగా ఎవరికైనా బాధ కలిగినా.. కోపం వచ్చినా.. వారి కోపం పోగొట్టేందుకు మంచి లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. వారికి నచ్చిన ప్లేస్ కి తీసుకువెళ్లి.. అక్కడ క్షమాపణలు చెప్పి.. వారి కోపాన్ని చిటికెలో తీర్చేస్తారు.
 

713

6.కన్య రాశి..
ఈ రాశివారు కొంచెం సింపుల్ గా ఉంటారు.  వారు చేసే పనులు కూడా అలానే ఉంటాయి. అందుకే.. వీరి క్షమాపణలు కూడా అలానే ఉంటాయి. సింపుల్ గా ఒక మెయిల్ లేదా, మెసేజ్ చేసి సారీ చెప్పేస్తారు. మహా అంటే ఓ గులాబి పువ్వు ఇస్తారు.
 

813

7.తుల రాశి..
ఈ రాశివారికి ఎదుటివారిని బాధించడం పెద్దగా ఇష్టం ఉండదు. పొరపాటున బాధ పెడితే.. వారే స్వయంగా కుకీస్ బేక్ చేసి లేదంటే... కేక్ తయారు చేసి మరీ స్వయంగా ఇష్తారు.
 

913

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు క్షమాపణలు చెప్పడం అంటే అస్సలు నచ్చదు. అసలు తాము చేసింది తప్పు అని కూడా వీరు ఒప్పుకోరు. ఇక.. క్షమాపణలు ఎలా చెబుతారు. చచ్చినా సారీ చెప్పరు.
 

1013

9.ధనస్సు రాశి..
ఈ రాశివారు ఎదుటి వారి కోపం పొగొట్టేందుకు క్షమాపణలు  చెప్పడానికి ముందు..  జోక్స్ వేసి నవ్విస్తారు. వారి కోపం పోయిన తర్వాత.. అప్పుడు మనస్పూర్తిగా క్షమాపణలు తెలియజేస్తారు.
 

1113

10.మకర రాశి..
 మకర రాశివారు.. తమ వల్ల ఎవరికైనా కోపం వస్తే.. వారి ముందు కూర్చొని మనసు విప్పి మాట్లాడతారు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొని మాట్లాడతారు. వారి కోపం తగ్గేలా చూస్తారు.
 

1213

11.కుంభ రాశి..
ఈ రాశివారికి ఓపిక ఎక్కువ.  ఎదుటివారు చెప్పేది పూర్తిగా వింటారు. తమ తప్పు ఎక్కడ ఉందో అడిగి తెలుసుకుంటారు. మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతారు. తర్వాత చాక్లెట్ కూడా ఇస్తారు.

1313

12.మీన రాశి..
ఈ రాశివారు వెంటనే క్షమాపణలు చెప్పేస్తారు. అయినా కోపం చల్లారకుంటే.. వారిని విపరీతంగా పాంపర్ చేస్తారు. వారికి నచ్చిన పని చేస్తారు. వారికి నచ్చిన ఆహారం అందిస్తారు.

click me!

Recommended Stories