Monthly Horoscope: ఈ నెల ఓ రాశివారికి ధనాదాయం బాగా పెరుగుతుంది..!

First Published Feb 1, 2022, 9:05 AM IST

ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెలలో నూతన బాధ్యతలు చేపడతారు. గౌరవ ప్రధమైన జీవనం అనుభవిస్తారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. ధనాదాయం సంతృప్తికరంగా ఉండును. 

మేషరాశి (Aries)అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ నెలలో ఈ మాసంలో సమస్యలు కొంత వరకు తగ్గును. నూతన గృహ సంబంధమైన లేదా గృహ మార్పిడి ప్రయత్నాలకు ఈ మాసం మంచి సమయం. కొద్దిపాటి కష్టంతో చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. విద్యార్ధులకు మంచి కాలం. 9,10.16.25 తేదీలు విదేశీ ప్రయత్నములకు, నూతన ఉద్యోగ ప్రయత్నములకు అనుకూలమైనవి. ఋణాలు తొలగి ఊరట పొందుతారు. రావలసిన ధనం పొందుతారు.స్థిరాస్థి సంబంధ సమస్యలు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ నెలలో నూతన బాధ్యతలు చేపడతారు. గౌరవ ప్రధమైన జీవనం అనుభవిస్తారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. ధనాదాయం సంతృప్తికరంగా ఉండును. శరీర ఆరోగ్యం కూడా సహకరించును. ద్వితీయ వారం వరకూ వృత్తి వ్యాపార విషయాల్లో  మంచి లాభములు లభిస్తాయి. తృతీయ వారం ప్రారంభం నుండి  పట్టుదలకు పోవడం వలన చక్కటి అవకాశములు కొల్పోవుదురు. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ఎదురగును. నూతనంగా ఏర్పడిన కుటుంబ బాధ్యతల వలన మానసిక ఆలోచనలు అధికం అగును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ నెలలో కోర్టు వ్యవహరాలకు, అవివాహితుల వివాహ ప్రయత్నములకు అనుకూలంగా ఉండును. ధనాదాయం ఆశించిన విధంగా బాగుంటుంది. నూతన వ్యక్తుల చేరిక వలన కుటుంబ బలం పెరుగుతుంది. ఉద్యోగ పరంగా  స్థానచలన ప్రయత్నాలకు ఈ మాసం అనుకూలమైన కాలం. గృహ వాతావరణంలో  అనుకూలంగా ఉంటుంది. వ్యాపారములు విస్తరించే అవకాశం లభించును. భాగస్వామ్య వ్యాపార  ప్రయత్నములు లాభించును. ముఖ్యంగా వ్యాపార వర్గం వారికి 25, 26, 27 తేదీలు మంచి ఫలితాలను కలిగించును. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ నెలలో గృహంలో విందు భోజనములు, అతిధులకు ఆతిధ్య సంబంధ వ్యయం ఎదుర్కొందురు. గృహంలో వాస్తు మార్పులు చేయుటకు ఈ మాసం అనుకూల కాలం. సంతానం తో చికాకులు ఏర్పడినప్పటికీ మాసాంతమునకు బుధ గ్రహ బలం వలన తొలగును. తృతీయ వారంలో ఉద్యోగ జీవనంలో ఉన్నతి. ఆశించిన ప్రమోషన్లు ఏర్పడును. అందరి మన్ననలను పొందుదురు. మాసాంతంలో సామాన్య ఫలితాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ నెలలో దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య బాధలు తొలగును. ఉద్యోగ జీవనంలో ఒత్తిడి తగ్గును. ప్రధమ మరియు ద్వితియ వారములలో శత్రువిజయం, ఆదాయ పెరుగుదల మరియు  జీవన హోదాలో ఉన్నతిని ఆశించవచ్చు. పురుష సంతాన వలన చికాకులు ఎదుర్కొందురు.సర్వ  శుభకార్య ప్రయత్నాలు లాభించును. మిత్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొనుటకు స్థిరమైన ఆలోచనలు చేయుట కష్టముగా ఉండును. ముఖ్యంగా 13 నుండి 22వ తేది మధ్య కాలం అనుకూలంగా లేదు. 23వ తేదీ నుండి పరిస్థితులలో అనుకూలమైన మార్పులు పొందుదురు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో చికాకులు ఉన్నప్పటికీ తలపెట్టిన పనులలో చివరకు జయం లభించును. వివాహ  సంబంధ సంతోషం పొందుతారు. శత్రు జయం లభిస్తుంది. చేయు పనులలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. పురాణ శ్రవణ కాలక్షేపం లభిస్తుంది. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ఈ మాసం విదేశీ ఉద్యోగ ప్రయత్నములకు అనుకూలమైన కాలం. కుటుంబ వ్యవహారములు ఆశించిన విధంగా అనుకూలంగా ఉండవు. చివరి వారంలో శ్రమ అధికం, అనిశ్చిత వాతావరణం ఎదుర్కొందురు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో తలపెట్టిన ప్రయత్నములు నెమ్మదిగా విజయం పొందును.కోర్టు తీర్పులు ప్రతికూలంగా వెలువడు సూచన ఉన్నది. మహిళలకు నిత్య జీవనంలో శ్రమ అధికమగును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గోనేదురు. గౌరవ ప్రదమైన వ్యక్తుల పరిచయం వలన సమాజంలో మీ  గౌరవం కూడా పెరుగును. గృహ మార్పిడి ప్రయత్నాలలో అనుకూలత లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు స్థానచలనముకు అవకాశం ఉన్నది. ఈ మాసంలో 13,14, 21,22, తేదీలు అంత అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ నెలలో కలసి వచ్చును. వివాహ ప్రయత్నములు చేయువారికి, ధన వెసులుబాటు కొరకు ప్రయత్నించు వారికి ఇది చక్కటి కాలం. ప్రభుత్వ ఉద్యోగ జీవనంలోని వారికి వాహనముద్రిదికార యోగం నూతన పరిచయాలు ఏర్పడుతాయి. మాసం మొత్తం ధనాదాయం బాగుండును. గృహంలో  నూతన వస్తువులను అమర్చుకోగలరు. మానసికంగా కుదుటపడుతారు. పొదుపు పధకాలు లాభాలను కలుగచేస్తాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ నెలలో అనుకూలమైన మాసం. నూతన గృహ లేదా వాహన కోరిక నెరవేరును. అవసరమైన ధనం  సమయానికి చేతికి లభించును. ఇరుగుపొరుగు వారి వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొందురు. ఆలోచనలు సక్రమంగా ఉండును. పనుల భారం వలన అలసట ఏర్పడును. తోటి ఉద్యోగులతో తృతీయ వారంలో విభేదాలు బాధించును. నూతన  విషయాల పట్ల ఆసక్తి పెరుగును. స్థిరాస్థి పత్రాలు మీ చేతికి వస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పరచును. ఉద్యోగ జీవనంలో ఉన్నతి లేదా స్థిరాస్తి సంబంధమైన ఆర్ధిక లాభాలు పొందుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆత్మీయుల వలన అవసరమైన సౌఖర్యములు ఏర్పరచుకొంటారు. కలహములు తొలగును. కీర్తి - ప్రతిష్టలు ఆర్జించెదరు. 18,19, 20 తేదీలు ప్రయాణములకు కలసి వచ్చును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ నెలలో అనుకూల ఫలితాలు కలుగచేయును.  ఆశించిన విధంగా నివాస పరమైన స్థానచలనముకు అవకాశం ఉన్నవి. మాస ప్రారంభంలో కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఎదురైనా ప్రమాదం ఉండదు. సంతాన మరియు బంధు సంబంధమైన వ్యయం కొంచం అధికంగా ఎదురగును. ఈ మాసంలో అదృష్ట ప్రాప్తి ఉంది. కార్య సిద్ధత ఉంది.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ నెలలో విద్యార్ధులకు అనుకూలమైన ఫలితాలను ఏర్పరచును. ధనాదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. గృహంలో శుభకార్యములు నిర్వహిస్తారు. దాదాపు అన్ని విషయాలలో ఈ మాసం అనుకూలత ఏర్పరుస్తుంది. ఉద్యోగ జీవనంలో ఉన్నత స్థితి అనుభవిస్తారు. వాహన వివాహాది సంబంధ విషయాలలో లాభములు పొందుతారు. సంతాన ప్రయత్నములు కూడా  ఫలించును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

    
గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

click me!