తల్లిగా ఈ రాశులవారు ఫేస్ చేసే అతి పెద్ద ఛాలెంజెస్ ఇవే..!

Published : Jan 31, 2022, 03:22 PM IST

ఈ క్రమంలో వారికి శత్రువులుగా మారతారు..మిమ్మల్ని పిల్లలు ద్వేషించుకునే అవకాశం ఉంది. కాబట్టి.. క్రమ శిక్షణలో పెట్టినా.. ప్రేమను అందించడం మాత్రం ఆపకూడదు.

PREV
113
తల్లిగా ఈ రాశులవారు ఫేస్ చేసే అతి పెద్ద ఛాలెంజెస్ ఇవే..!
parent astro

పిల్లలను పెంచడం అతి పెద్ద సవాలుగా చెప్పొచ్చు. మనం ఊహించనట్లు పిల్లలు ఉండరు. మనం చెప్పేదొకటి.. వారు  చేసేదొకటి. పిల్లల విషయంలో అతి పెద్ద సవాలు తల్లి ఎదుర్కొంటుదనే చెప్పాలి. తల్లిగా.. ఏ రాశివారు పిల్లల విషయంలో ఎలాంటి సవాలు ఎదుర్కొంటారో ఓసారి చూద్దామా..

213

మేషం : మేషరాశి తల్లులకు  నాయకత్వ లక్షణాలు ఎక్కువ.  వీరు తమ పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని అనుకుంటూ ఉంటారు. వీరి క్రమశిక్షణకు  పిల్లలు  భయపడతారు. వారిని క్రమశిక్షణలో పెట్టేందుకు  ఈ రాశివారు చాలా కృషి చేస్తారు. ఇదే వీరి అతి పెద్ద సవాలు.వీరు చేస్తున్న కృషి పిల్లలు సరైన మార్గంలో నడవడానికి సహాయపడుతుంది. అయితే,  పిల్లను అదుపుచేసే క్రమంలో వీరు సహాన్ని కోల్పోతారు. విపరీతమైన కోపం తెచ్చుకుంటారు.

313

వృషభం: మేషరాశివారి తల్లుల మాదిరిగానే  ఈ రాశివారు కూడా పిల్లలను క్రమ శిక్షణలో పెట్టాలని అనుకుంటారు. ఈ క్రమంలో వారికి శత్రువులుగా మారతారు..మిమ్మల్ని పిల్లలు ద్వేషించుకునే అవకాశం ఉంది. కాబట్టి.. క్రమ శిక్షణలో పెట్టినా.. ప్రేమను అందించడం మాత్రం ఆపకూడదు.

413

మిథునం : ఈ రాశివారు పిల్లలతో ఎప్పుడూ చాలా సరదాగా ఉంటారు. వారికి నిత్యం కబుర్లు చెబుతూ.. ఆడిస్తూ ఉంటారు.  వీరి ప్రేమను పిల్లలు బాగా ఆస్వాదిస్వారు. అయితే.. వారు మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా  జాగ్రత్త పడాలి.  
 

513

కర్కాటకరాశి:  ఈ రాశివారు  కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తారు. పిల్లలను చాలా ప్రేమగా చూసుకుంటారు. పిల్లలు ఎదిగినా.. వారితో ప్రేమగానే ఉంటారు.  పిల్లల్ని వదిలేసి మళ్లీ ఉద్యోగం చేయడం నీకు చాలా కష్టం. అందుకే వాటిని అరరోజు విడిచిపెట్టడానికి ముందూ వెనుకా ఆలోచిస్తారు. ఇది పిల్లలను ఎక్కువగా ఆధారపడేలా చేస్తుంది. వారికి కొంత సమయం ఇవ్వండి మీ కోసం కొంత సమయాన్ని వెచ్చించడం సాధన చేయండి.
 

613

సింహం :ఈ రాశివారు తమ  పిల్లల గురించి గర్వపడుతారు. వారికి మరింత రక్షణ , ప్రేమను అందించాలి. మీరు వారితో సంతోషంగా ఉన్నందున పిల్లలు మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. అయితే.. మరీ ఎక్కువగా పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వకూడదు. కాస్త కంట్రోల్ లో పెట్టుకోవాలి.

713

కన్య: ఈ రాశికి చెందిన తల్లులు అన్ని విషయాల్లో ఆల్ రౌండర్స్. పర్ఫెక్ట్ గా ఉంటారు.. మల్టీ టాస్కింగ్‌ వీరికి వెన్నతో పెట్టిన విద్య. అందువల్ల మీరు పిల్లలను నిర్వహించడం సులభం. పిల్లలు ఏ సమస్య వచ్చినా పిల్లలు  మీ సహాయం కోసం చూస్తారు. అయితే.. ఒక్కోసారి మీకు అన్నీ తెలిసి ఉండటం కూడా వారికి ఒత్తిడి కలిగిస్తుంది. 

813

తుల:  ఈ రాశివారు పిల్లలను ప్రతి విషయంలోనూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మీ పిల్లలు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఎలంటి నియమాలు లేకుండా పిల్లలను పెంచుతారు. వారు కూడా చక్కగా హుందాగా పెరుగుతారు. అయితే.. ఒక్కోసారి మీరు పిల్లలను కంట్రోల్ చేయాల్సి వస్తే.. గందరగోళానికి గురౌతూ ఉంటారు. 

913

వృశ్చికం:  ఈ రాశివారు  పిల్లల సమస్యలను బాగా అర్థం చేసుకుంటారు. అదేవిధంగా  పరిష్కరిస్తారు కూడా. వారికి  ఏ కష్టం వచ్చినా సహాయం చేయడానికి ముందుంటారు.  మీరు పిల్లలకు నిజాయితీ మ, రక్షణ రెండింటినీ ఇస్తారు. కానీ చాలా సందర్భాలలో, మీరు పిల్లల సమస్యను మీరే పరిష్కరిస్తారు. సమస్యలకు ఎదురొడ్డి పోరాడటం నేర్పించడం వారికి నేర్పడం అవసరం.

1013

ధనుస్సు : బాల్యం ఎప్పుడూ ఆనందంగా ఉండాలని మీరు కోరుకుంటూ ఉంటారు.మీరు  వారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. అయినప్పటికీ, పిల్లలను పెంచేటప్పుడు కొంచెం ఓపికగా ఉండటం మీకు సవాలుగా ఉంటుంది. నిమిషం కూడా వారు మిమ్మల్ని ప్రశాంతంగా పని చేసుకోనివ్వరు.

1113

మకరం: మీరు జీవితంలోని అన్ని సవాళ్లను ఎదుర్కోగల సామర్థ్యం కలిగి ఉంటారు. ఒక తల్లిగా మీరు దానిని బాధ్యతాయుతంగా నిర్వహిస్తారు. కాబట్టి మీరు మాతృత్వాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అయితే పిల్లల విషయంలో మాత్రం సీరియస్‌నెస్ అవసరం లేదు. మీ గంభీరత పిల్లలకు ఆందోళన కలిగిస్తుంది.

1213

కుంభం : మీ నిస్వార్థ స్వభావంతో మీరు ఉత్తమ శ్రద్ధగల తల్లి అవుతారు. మీ పిల్లల అవసరాలు, వారి జీవితంలో ఏం జరుగుతుందో మీకు చెప్పకుండానే మీకు తెలుస్తుంది. అంతా మంచిదే. కానీ మీ కోసం కొంత సమయం కేటాయించడం మర్చిపోవడమే తప్పు.

1313

మీనం: కలలు కనేవారిగా, కళాత్మకంగా , సెన్సిటివ్‌గా మీరు పిల్లలకు ఏమి కావాలో నేర్పుతారు. కానీ, కొన్నిసార్లు మీరు వాస్తవంలో ఉన్నారని మర్చిపోతారు. దీంతో చిన్నారుల కలలు సాకారం కానున్నాయి. పిల్లలు దానిని సాధించలేనప్పుడు ఒత్తిడిని ఎదుర్కొంటారు.

click me!

Recommended Stories