2. బాధ్యతల భారం (Burden of Responsibility)
శని ప్రభావం ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు లేదా అనారోగ్యం వంటివి ఎదురవ్వచ్చు. ఇవి మీ సంబంధంపై ఒత్తిడిని పెంచుతాయి.
అంటే, కష్ట సమయాల్లో మీరు ఒకరికొకరు తోడుగా ఉంటున్నారా? లేదా సమస్యలు రాగానే ఒకరినొకరు నిందించుకుంటున్నారా? అని శని దేవుడు పరీక్షిస్తాడు. ఇలాంటి పరీక్షల కారణంగా.. ఒకరిపై ఒకరికి తిరుగులేని నమ్మకం ఏర్పడుతుంది. "మేము ఏ కష్టాన్నైనా కలిసి ఎదుర్కోగలం" అనే ధైర్యం కలుగుతుంది.
3. భావోద్వేగ దూరం (Emotional Distance)
కొన్నిసార్లు మీ భాగస్వామి మీకు దూరంగా ఉన్నట్లు, మీ మాటలు వినడం లేదని లేదా మీ మధ్య ప్రేమ తగ్గిందని అనిపించవచ్చు. శని మౌనాన్ని, క్రమశిక్షణను ఇష్టపడతాడు.
అంటే, ఆకర్షణ తగ్గినప్పుడు కూడా మీరు ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? లేదా అని శని పరీక్షిస్తాడు. ఇలాంటి పరీక్ష వల్ల శారీరక ఆకర్షణకు మించిన లోతైన ఆత్మీయ అనుబంధం (Deep Intimacy) ఏర్పడుతుంది.
4. సహనానికి పరీక్ష (Test of Patience)
శని కాలానికి అధిపతి (Lord of Time). వివాహం నిశ్చయం కావడంలో ఆలస్యం లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆటంకాలు ఎదురవ్వవచ్చు.
అంటే, మీరు తొందరపడి ఆ బంధాన్ని తెంచుకుంటున్నారా? లేక సరైన సమయం కోసం ఓపికగా వేచి చూస్తున్నారా? అని శని దేవుడు పరీక్షిస్తాడు. దీని వల్ల... ఆలస్యంగానైనా లభించే ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుంది.
5. హద్దులు , క్రమశిక్షణ (Boundaries)
మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా, అవతలి వ్యక్తికి ఎంత గౌరవం ఇస్తున్నారనేది శని గమనిస్తాడు.
పరీక్ష: ఒకరిని ఒకరు నియంత్రించాలని (Control) చూస్తున్నారా? లేదా ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవిస్తున్నారా?
ఆశీర్వాదం: గౌరవప్రదమైన, పరిణతి చెందిన (Mature) సంబంధం లభిస్తుంది.
ముగింపు:
శని దేవుడు మంచి సంబంధాన్ని ఎప్పుడూ విచ్ఛిన్నం చేయడు. ఒకవేళ ఏదైనా బంధం విడిపోతే, అది బలహీనమైన పునాది మీద ఉందని అర్థం. శని ఇచ్చే పరీక్షల్లో నెగ్గితే, ఆ బంధం జీవితాంతం నిలిచిపోతుంది. అందుకే శనిని "సంరక్షకుడు" అని కూడా అంటారు.