
మనిషి ఉన్నాక ప్రతి ఒక్కరికీ కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. ఇవి లేకుండా ఎవరిక జీవితమూ పూర్తవ్వదు.అయితే... తరచుగా ఏ రాశివారు ఎందుకు ఏడుస్తారు..? అసలు ఎవరు ఎక్కువగా బాధ పెడుతుంటారు..? జోతిష్యశాస్త్రం ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...
1.మేష రాశి..
మేష రాశివారు కొంచెం స్ట్రాంగ్. తొందరగా కన్నీళ్లకు పని చెప్పరు. వీరు ఏడ్చే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. సంవత్సరానికి వీరు రెండు సార్లో, మూడు సార్లో వీరు ఏడుస్తారు.
2.వృషభ రాశి..
ఈ రాశివారు కాస్త ఎమోషనల్ గా ఉంటారు. అందుకే కనీసం నెలకి ఒక్కసారైనా ఈ రాశివారు ఏడుస్తుంటారు. అది కూడా ఒంటరిగా కూర్చొని మరీ ఏడుస్తుంటారు. తమ జీవితంలో ఉన్న బాధలను తలుచుకొని వీరు ఏడుస్తుంటారు.
3.మిథున రాశి..
ఈ రాశివారు తరచూ ఏడుస్తూ ఉండరు. అయితే... అది ఏడ్చే సందర్భమైతే తప్ప ఈ రాశివారు తొందరగా ఏడ్వరు.
4.కర్కాటక రాశి..
ఈ రాశివారు టూమచ్ ఎమోషనల్. కనీసం రోజుకి ఒక్కసారైనా ఏడ్వకుండా ఉండలేరు. ప్రతి చిన్న విషయానికీ ఏడ్చేస్తూ ఉంటారు.
5.సింహ రాశి..
ఈ రాశివారు పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు, లేదా ఎవరైనా బాధపెట్టినప్పుడు ఏడుస్తారు. అది కూడా ఎవరూ చూడకుండా.. బాత్రూమ్ లో ఏడ్చేస్తారు. ముఖ్యంగా వీరు వారానికి ఒక్కసారైనా ఏడ్చేస్తారు.
6.కన్య రాశి..
ఈ రాశివారు కాస్త స్ట్రాంగ్ అనే చెప్పాలి. తొందరగా ఎమోషన్స్ ని బయటపెట్టరు. అందుకే కన్య రాశివారు ఆరు నెలలకు ఒక్కసారి మాత్రం ఏడుస్తారు.
7.తుల రాశి..
ఈ రాశివారు తుమ్మినా, దగ్గినా కూడా ఏడ్చేస్తూ ఉంటారు. ఎవరినైనా మిస్ అయినా... ఎవరైనా ఏదైనా అన్నా కూడా వీరు ఏడుస్తారు.ఈ లెక్కన వారు సుమారుగా.. వారానికి మూడు సార్లైనా ఏడుస్తారు. ఏడ్వకుండా ఉండలేరు కూడా.
8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు కొంచెం తొందరగా తమ మనసులోని బాధను బయటపెట్టరు. ఎందుకంటే వీరు తొందరగా కన్నీళ్లు బయటపెట్టరు. ఈ రాశివారు ఏడ్వడం చాలా అరుదు. కొన్ని సంవత్సరాలకు ఒకసారి వీరు ఏడుస్తారు
9. ధనస్సు రాశి..
ఈ రాశివారు చాలా కాలం తర్వాత పేరెంట్స్ ని కలిసినప్పుడు... లేదంటే ఎవరినైనా మిస్ అయినప్పుడు మాత్రమే వీరు ఏడుస్తారు. చాలా తక్కువగా ఏడుస్తారనే చెప్పాలి. అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వీరు ఏడుస్తారు.
10.మకర రాశి..
జీవితంలో ఏదైనా అత్యంత కష్టం వచ్చినప్పుడు ఈ రాశివారు కన్నీళ్లు పెట్టుకుంటారు. అంటే.. ఓ రెండు నెలలకు ఒకసారి ఈ రాశివారు కన్నీళ్లు పెట్టుకుంటారు.
11.కుంభ రాశి..
కుంభ రాశివారు తొందరగా కన్నీళ్లు పెట్టుకోరు. వీరు దశాబ్దానికి ఒక్కసారి ఏడుస్తారని చెప్పాలి. జీవితంలో ఏదైనా కోల్పోయాము అనుకుంటే తప్ప ఈ రాశివారు ఏడ్వరు.
12.మీన రాశి..
ఈ రాశివారు తరచూ ఏడుస్తూనే ఉంటారు. ఈ క్షణం కూడా ఏడుస్తున్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే వీరు తరచూ ఏడుస్తూనే ఉంటారు.