ఈ రాశివారి మాటలు చాలా తీయగా ఉంటాయి...!

Published : Sep 07, 2022, 11:14 AM IST

ఆహా వీరు మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది. వాళ్లనే స్వీట్ టాకర్స్ ఉంటారు. వారి మాటలు చాలా మధురంగా ఉంటాయి.

PREV
15
 ఈ రాశివారి మాటలు చాలా తీయగా ఉంటాయి...!


మీరు గమనించారో లేదో... కొందరు మాట్లాడుతుంటే.. అబ్బ ఎప్పుడు వదులుతారురా బాబు అనిపిస్తూ ఉంటుంది. కానీ కొందరు మాట్లాడుతుంటే మాత్రం... ఆహా వీరు మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది. వాళ్లనే స్వీట్ టాకర్స్ ఉంటారు. వారి మాటలు చాలా మధురంగా ఉంటాయి. జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ కింద రాశులవారు కూడా ఇతరులతో చాలా మధురంగా మాట్లాడతారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
 

25

1.తులారాశి

తుల రాశివారు సహజంగానే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ వీరు ఒంటరిగా ఫీలవ్వరు. ఎక్కువ ఒత్తిడికి కూడా గురవ్వరు. ఏదైనా ఇబ్బంది కలిగినా, వారు దానిని తమలో మాత్రమే ఉంచుకుంటారు. ఈ రాశివారు సహజంగా ఒకే రకమైన వ్యక్తుల చుట్టూ ఉండడాన్ని ఇష్టపడతారు. తమపై శ్రద్ధ చూపించేవారితో వీరు ఎక్కువగా సమయం గడుపుతారు. ఈ రాశివారు.. అందరితోనూ చాలా మధురంగా, చాలా తీయగా ప్రేమగా మాట్లాడతారు. 
 

35

2.మిథున రాశి...

మిథున రాశివారు  సాధారణంగా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చొరవ తీసుకుంటారు. చాలా ఉత్సాహంగా మాట్లాడతారు. వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ రాశివారు చాలా ఇంట్రావర్టర్స్. వీరికి ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. చాలా ప్రేమగా ఉంటారు. వీరు మాట్లాడటం మొదలుపెడితే.. ఎవరైనా నోరు తెరిచి వింటూ కూర్చోవాల్సిందే. 

45

3.మీన రాశి..

మీన రాశివారు  చాలా మంచివారు. అందరితోనూ స్నేహంగా ఉంటారు. ఎవరికి సహాయం అవసరమైనా...వెంటనే ముందుండి సహాయం చేస్తారు. ఈ రాశివారు అందరితోనూ చాలా మృదువుగా మాట్లాడతారు. అందరికీ ప్రేమ పంచుతారు. ఇతరులతో ఎలా ఉండాలో వీరికి తెలిసినంత బాగా మరెవరికీ తెలియదు. వీరి మాటలు ఎవరినైనా ఆకట్టుకుంటాయి. 
 

55

4.వృశ్చిక రాశి..

వృశ్చిక రాశివారు మాటలతోనే బూరలు వండేస్తారు. వీరి మాటలు అలా ఉంటాయి. ఇతరులను ఆకర్షించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను మానిప్యూలేట్ చేయడం కూడా వీరికి బాగా తెలుసు. ఇతరుల నుంచి ప్రయోజనాలు ఎలా పొందాలో వీరికి బాగా తెలుసు. వీరి మాటలు చాలా మధురంగా ఉంటాయి. వీరి మాటలకు ఎవరైనా ఇట్టే పడిపోతారు.


 

click me!

Recommended Stories