ఏ రాశి అబ్బాయిలు తమ భాగస్వామిని బాగా చూసుకుంటారో తెలుసా?

First Published | Nov 10, 2023, 12:57 PM IST

వీరు బహుమతులు ఇవ్వడం కాదు, వారు మీ నుంచి బహుమతులు, మంచి కాస్ట్ లీ వస్తువులు, డిన్నర్ లకు మీరే వారిని తీసుకువెళ్లాలని ఈ రాశి పురుషులు కోరుకుంటారు.

telugu astrology


1. మేష రాశి...

మేష రాశికి చెందిన అబ్బాయిలు చాలా రొమాంటిక్ గా ఉంటారు. తమ జీవితంలోకి వచ్చిన మహిళను తమతో సమానంగా చూసుకుంటారు. అప్పుడప్పుడు బహుమతులు ఇస్తూ, పాంపర్ చేస్తూ ఉంటారు.

telugu astrology

2.వృషభ రాశి..
వృషభ రాశి పురుషులు తమ భాగస్వామిని ప్రేమిస్తారు. కానీ, ఈ రాశివారికి విలువైన బహుమతులు ఇవ్వడం లాంటివి మాత్రం నచ్చదు. కానీ, వీరు కేరింగ్ గా ఉంటారు. చూపించాల్సిన ప్రేమ చూపిస్తారు. కానీ, బహుమలతో ఆనందింప చేయడం వీరికి రాదు.


telugu astrology

3.మిథున రాశి..
మిథున రాశి పురుషులు తమ భాగస్వామి చేతిలో చెయ్యి వేసి మాట్లాడగలరు. ఎక్కడికి వెళ్లినా చేతిలో చెయ్యి వేసి నడుస్తుంటారు. తమ భాగస్వామిని ప్యాంపర్ చేస్తారు. కానీ, అది కూడా చాలా అరుదుగా ఉంటుంది.

telugu astrology

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు పురుషులు తమ జీవితంలోకి వచ్చే మహిళలను అన్ని డ్రీమ్స్ ని వారు పూర్తి చేస్తారు. వారు చేయాలి అనుకున్నవి కూడా వీరే చేసేసి, అన్నీ స్పాయిల్ చేస్తూ ఉంటారు. కానీ, వీరి ప్రేమకు మాత్రం ఎవరైనా ఫిదా అవ్వాల్పిందే.

telugu astrology

5.సింహ రాశి..
సింహ రాశివారు ఎక్కడ ఉన్నా, తాము సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలని అనుకుంటూ ఉంటారు. తమ భాగస్వామి కూడా తమను స్పెషల్ గా చూడాలని కోరుకుంటారు. వీరు బహుమతులు ఇవ్వడం కాదు, వారు మీ నుంచి బహుమతులు, మంచి కాస్ట్ లీ వస్తువులు, డిన్నర్ లకు మీరే వారిని తీసుకువెళ్లాలని ఈ రాశి పురుషులు కోరుకుంటారు.

telugu astrology

6.కన్య రాశి..
కన్య రాశి పురుషులు కూడా చాలా రొమాంటిక్ గా ఉంటారు.  ఈ రాశివారు తమ భాగస్వామి గురించి ఆలోచించినప్పుడు  చాలా ప్రేమగా కొన్ని మాటలు చెబుతారు. అవసరం అయితే, కవితలు కూడా చెబుతారు.

telugu astrology

7.తుల రాశి..
తుల రాశివారు తమ భాగస్వామి పై అమితమైన ప్రేమను చూపిస్తారు. కానీ, తమ భాగస్వామి బలవంతంగా తమను ప్యాంపర్ చేయాలి, తమ కోసం ఇలా చేయాలి అని డిమాండ్ చేస్తే మాత్రం, ఈ రాశివారు అంత బలవంతంగా వీరు ప్రేమ చూపించలేరు.

telugu astrology

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు తమ భాగస్వామికి చాలా భయపడుతూ ఉంటారు.  అదేవిధంగా చాలా ఫ్యాషినేటివ్ గా ఉంటారు.  ఈ రాశివారు తమ భాగస్వామిని దేవతలా పూజిస్తారు. వారు చెప్పినట్లుగానే చేస్తారు. చాలా గొప్పగా చూసుకుంటారు.

telugu astrology

9.ధనస్సు రాశి..
ఈ రాశివారు చాలా ధ్రుడంగా ఉంటారు. తమ బంధం నిలపడటానికి ఈ రాశివారు చాలా ఎక్కువగా కృషి చేస్తారు.  ఈ రాశివారు తమ భాగస్వామిని  క్యూట్ డేట్స్ కి తీసుకువెళుతూ ఉంటారు. అప్పుడుప్పుడు బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు.

telugu astrology

10.మకర రాశి..
మకర రాశివారు తమ జీవితంలోకి వచ్చిన భాగస్వామిని చాలా ప్రేమగా  చూసుకుంటారు. తమ భాగస్వామికి జీవితంలో ఇవ్వాల్సిన అన్ని కంఫర్ట్స్ ఈ రాశివారు పురుషులు అందిస్తారు.

telugu astrology

11.కుంభ రాశి..
చాలా మంది తమ భాగస్వామితో అసహజంగా ఉంటారు. కానీ, కుంభ రాశివారికి బహుమతులు ఇవ్వడం రాకపోయినా, చాలా కనెక్షన్ తో ఉంటారు. ఎక్కువ ప్రేమను పంచుతారు. ఎక్కువగా మనసుతో కనెక్ట్ అవుతారు.

telugu astrology

12.మీన రాశి..
మీన రాశి పురుషులు తమ జీవిత భాగస్వామికి పూలు, బహుమతులు అందిస్తూ ఉంటారు. సమయం వచ్చినప్పుడల్లా  ప్రేమను తెలియజేస్తారు. వారి కోసం లంచ్, బ్రేక్ ఫాస్ట్ లాంటివి ప్రిపేర్ చేస్తారు. 

Latest Videos

click me!