మేషరాశి : ఆందోళనగా ఉన్నప్పుడు ప్రశాంతతకోల్పోతారు. అసహనంగా ఉంటారు. ఏదైనా శారీరకశ్రమతో కూడి పనిలో పడిపోతారు. లేదా మనసును మళ్లించే మరేదైనా పనిని ఎంచుకుంటారు.
వృషభరాశి : ఆందోళన వీరిని మొండివారిగా, కఠినంగా మారుస్తుంది. మిగతా వారితో దూరంగా ఉంటారు. ఆందోళన తొలగించుకోవడానికి రొటీన్ పనిలో మునిగిపోతారు.
మిధునరాశి : ఆందోళన వీరిని అతిగా ఆలోచించేలాచేస్తుంది. ఈ సమయంలో ఎక్కువతక్కువ మాట్లాడేస్తారు. లేదా దాన్నుండి తప్పించుకోవడానికి.. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఏవేవో చేస్తుంటారు.
కర్కాటకరాశి : ఈ రాశివారు ఆందోళనగా ఉన్న సమయంలో భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడానికి ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. సురక్షితం అనుకునే వ్యక్తుల నుంచి, సన్నిహితుల నుంచి ఓదార్పు కోరుకుంటారు.
సింహరాశి : ఈ రాశివారికి యాంగ్జైటీ వస్తే ఎదుటివారు చచ్చినట్టే.. ఫుల్ డిమాండింగ్ గా మారిపోతారు. అటేన్షన్ కోరుకుంటారు. డ్రామాబాజీ అయిపోతారు.
కన్య రాశి : తమమీద తాము విపరీతంగా విమర్శలు చేసుకుంటారు. కంట్రోల్ లోకి రావడానికి క్లీనింగ్ చేయడం లేదా ఆర్గనైజింగ్ మీద దృష్టి పెడతారు.
తులారాశి : ఆందోళన సమయంలో వీరు అనిశ్చితంగా మారిపోతారు. ఎక్కువ కేర్ తీసుకుంటారు. ఇతరులను మచ్చిక చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడాలని, టెన్షన్స్ తగ్గించుకోవాలని చూస్తారు.
వృశ్చిక రాశి : ఆందోళన కలిగితే వీరు తీవ్రంగా మారిపోతారు. భావోద్వేగపరంగా వీక్ అవుతారు. తమ రహస్యాలను మరింత దాచుకుంటారు. ఎవర్నీ దగ్గరికి రానివ్వరు.
మకరరాశి : ఆందోళన సమయంలో వీరు విచిత్రంగా ప్రవర్తిస్తారు. తమ లక్ష్యాలు, బాధ్యతల పట్ల మరీ ఎక్కువ దృష్టి పెడతారు. ఇతరుల నుంచి సహాయం తీసుకోవడానికి ఇష్టపడరు.
ధనుస్సు రాశి : ధనుస్సు రాశివారు ఆందోళనలో ఉంటే విపరీతంగా ప్రవర్తిస్తారు. కామెడీలు చేస్తుంటారు. లేదా ఆ పరిసరాలనుంచి తప్పించుకోవడానికి ప్రయాణాలు చేస్తారు.
కుంభ రాశి : వీరు ఆందోళన చెందితే తమ చుట్టూ ఉన్నవారితో దూరంగా జరుగుతారు. ఏదో మేధావిత్వం ఉన్నట్టుగా.. తీవ్ర ఆలోచనలతో ఉన్నట్లు నటిస్తారు.
మీన రాశి : మీనరాశివారు మరీ సెన్సిటివ్ గా మారపోతారు. పగటి కలలు కనడం, ఏదైనా సృజనాత్మకంగా చేయాలనుకోవడం లాంటి పనులతో తమను తాము బంధించుకుంటారు.