Dishti Removal: మీకు దిష్టి పెట్టారా? ఇలా చేస్తే ఆ చెడు ప్రభావం మొత్తం పోతుంది

Published : Apr 02, 2026, 05:29 PM IST

Dishti Removal: పిల్లలకు, పెద్దలకు, ఇంటికి.. ఒక్కోసారి దిష్టి తగిలిన లక్షణాలు కనిపిస్తాయి. ప్రజల నమ్మకాల్లో దిష్టికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దిష్టి తగిలితే ఏం చేయాలో చాలా మందికి తెలియదు. కొన్ని పనులు చేస్తే దిష్టి మొత్తం పోతుందట.

PREV
15
దిష్టి తగిలితే జాగ్రత్త

 పిల్లలు, పెద్దలు ఉన్నట్టుండి అనారోగ్యం పాలవుతారు, లేదా చిరాకు కోపం పడుతుంటారు. ఇంట్లో అకస్మాత్తుగా చిక్కులు మొదలవుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే దిష్టి తగిలిందనే అనుమానం ఎక్కువ మందికి వస్తుంది. దిష్టి తీయడానికి కొన్ని దేశీ పద్ధతులు చాలా ఫేమస్. ఇవి కేవలం నమ్మకాలే కాదు, తరతరాలుగా వస్తున్న అనుభవాలు. ఇంతకీ ఎలా తీస్తే దిష్టి మొత్తం పోతుందో తెలుసా?

25
మిరపకాయలు ఉప్పుతో..

ఇంట్లోని మహిళలు కొన్ని ఎండు మిరపకాయలు, ఉప్పు, ఆవాలు చేతిలోకి తీసుకోవాలి.  పిల్లలు లేదా పెద్దల తల చుట్టూ మూడు సార్లు తిప్పి వాటిని నిప్పుల్లో వేయాలి. ఒకవేళ మిరపకాయలు కాలినా ఘాటు వాసన రాకపోతే, దిష్టి బలంగా తగిలిందని నమ్ముతారు. 

35
శనివారం చీపురు చెప్పులతో

దిష్టి తీసేందుకు శనివారం ఉత్తమమని అంటారు.  పాత చెప్పు లేదా చీపురుతో పిల్లాడికి దిష్టి తీసి, దాన్ని ఇంటి గుమ్మం దగ్గర ఉంచడంఒక పద్ధతి. దీన్ని 'నెగెటివ్ ఎనర్జీని తొలగించే' విధానంగా చెబుతారు. ఇక చిన్నపిల్లలు ఉన్న ఇంటి గుమ్మం దగ్గర అడ్డుగా చీపురుని పెట్టినా చెడు గాలి లోపలికి రాదని నమ్ముతారు.

45
ఆవనూనెతో దిష్టి వత్తి

పత్తితో చేసిన వత్తిని ఆవనూనెలో ముంచి దిష్టి తగిలిన వ్యక్తి తల చుట్టూ మూడు సార్లు తిప్పుతారు. తర్వాత దాన్ని వెలిగిస్తారు. కింద పెట్టిన నీళ్ల గిన్నెలో పడే నూనె చుక్కల శబ్దాన్ని బట్టి దిష్టి పోయిందని భావిస్తారు. నూనె చుక్కలు ఎంత ఎక్కువగా పడితే, దిష్టి అంత బలంగా తగిలిందని నమ్మకం.  

55
మట్టి, ఆవు తోకతో దిష్టి

పల్లెటూళ్లలో దారిలో దొరికే మట్టి, ఉప్పు, మిరపకాయలు కలిపి దిష్టి తీస్తూ ఉంటారు.  ఆవు తోకను దిష్టి తగిలిన వ్యక్తి తలచుట్టూ తిప్పి దిష్టి తీస్తారు.  

Read more Photos on
click me!

Recommended Stories