బంగారు ఆభరణాలు కలలో కనిపిస్తే మంచిదే. భవిష్యత్తులో ఖర్చులు పెరుగుతాయని కూడా ఈ కల చెబుతుంది. కాబట్టి తెలివిగా ఖర్చు చేయాలి. బంగారు ఆభరణాలు కల రాగానే పొంగిపోకూడదు.. ఖర్చులు ఎక్కువ అవుతాయని ముందస్తు హెచ్చరికగా ఈ కలను భావించాలి.
ఒక వ్యక్తి బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు కల కంటే మాత్రం అది పూర్తిగా అశుభం. మీరు చేస్తున్న వ్యాపారంలో నష్టాలు కలగవచ్చు.. లేదా ఉద్యోగం చేస్తున్న చోట సహోద్యోగి చేతిలో మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.