జోతిష్యశాస్త్రం ప్రకారం.. మీ పెంపెడు కుక్క గురించి తెలుసుకోవచ్చు తెలుసా?

First Published Jan 27, 2022, 10:22 AM IST

ఎప్పుడైనా మీ పెంపుడు కుక్క గురించి కూడా ఇలా ఆలోచించారా..? విచిత్రంగా ఉన్నా కూడా..   రాశిచక్రం ప్రకారం.. మీ కుక్క ఎలా ఆలోచిస్తుందో తెలుసుకోవచ్చట. అదెలాగో చూద్దాం.

pet dog

మనమందరం మనుషులం. మనందరికీ.. మన రాశిచక్రాల గురించి తెలుసు. కాబట్టి..  అవి మన గురించి ఏం చెబుతున్నాయో తెలుసు. తరచూ వాటి గురించి వెతికి.. వాటి గురించి తెలుసుకుంటాం. కానీ.. ఎప్పుడైనా మీ పెంపుడు కుక్క గురించి కూడా ఇలా ఆలోచించారా..? విచిత్రంగా ఉన్నా కూడా..   రాశిచక్రం ప్రకారం.. మీ కుక్క ఎలా ఆలోచిస్తుందో తెలుసుకోవచ్చట. అదెలాగో చూద్దాం.

pet dogs

1.మేష రాశి..
ఈ రాశివారికి చాలా సాహసోపేతమైన కుక్క ఉండే అవకాశం ఎక్కువ. ఈ కుక్క ఎక్కువగా ఉడతలను వెంబడించడాన్ని ఇష్టపడుతుంది. దానితో ఆడుకోవడం ఈ కుక్కలను ఎక్కువగా ఇష్టం. ఇక.. ఇది ఎక్కువగా.. అరుస్తూనే ఉంటుంది. బయట ఎవరైనా వెళ్తున్నారు అనిపించినా.. అది అరిచేస్తూ ఉంటుంది. 

2.వృషభ రాశి..
ఈ కుక్కలకు యాటిట్యూడ్ ఎక్కువ. మనం చెప్పింది వినదు. దానికి నచ్చితేనే ఏదైనా చేస్తుంది. దానికి నడవాలి అనిపిస్తే నడుస్తుంది.. పరిగెత్తాలంటే పరిగెత్తుతుంది. అంతేకానీ.. మనం చెప్పింది మాత్రం వినదు. దానికి తోచింది చేస్తుంది. 

3.మిథున రాశి..
ఈ కుక్క ఎక్కువగా  మూడీగా ఉంది. ఒక్కోసారి ఈ కుక్క ఆనందంతో ఎగిరి గంతులు వేస్తుంది. ఒక్కోసారి డల్ గా కూర్చుంటుంది.  ఈ మూడీ కారణంగా దీనికి ఎక్కువగా దెబ్బలు పడే అవకాశం ఉంది.

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశి కుక్క చాలా భావోద్వేగంగా ఉంటుంది. వారు చాలా సెన్సిటివ్. వారు మీ పట్ల చాలా ఆప్యాయత చూపిస్తాయి. ది బెస్ట్ పెంపుడు కుక్కలుగా వీటిని చెప్పొచ్చు. చాలా ప్రేమగా ఉంటాయి. 

5.సింహ రాశి..
ఈ కుక్కలు అమ్మో సినిమా రేంజ్ లో డ్రామాలు చేస్తాయి..యాక్టింగ్ బాగా చేస్తాయి. అయితే.. ఇంటి దరిదాపుల్లోకి మాత్రం ఎవరినీ రానివ్వవు. ఇంటికి చాలా రక్షణగా నిలుస్తాయి

6.కన్య రాశి..

ఈ కుక్కలు ఎందుకో కొంచెం ఆందోళన చెందుతూ ఉంటాయి.  చాలా కాలిక్యూలేటివ్ గా ఉంటాయి. ఎప్పుడూ.. తమను ఎవరో ఒకరు పట్టించుకోవాలని ఆశపడుతూ ఉంటాయి. 
 

7.తుల రాశి..
మీ కుక్కలు  అన్ని పనులు వాయిదా వేస్తాయి. ఎలా అంటే.. పెట్టిన ఆహారం మొత్తం ఒకేసారి తినవు. సగం తిని.. కాసేపు ఆగి.. మళ్లీ తర్వాత మళ్లీ తింటాయి. ఎక్కువగా నాటీ పనులు చేస్తూ ఉంటాయి. 

8.వృశ్చిక రాశి..
ఈ కుక్క ఎప్పుడూ చిల్ అవ్వదు. యజమాని పట్ల చాలా నమ్మకంగా ఉంటాయి. వేరే కుక్కలను చూస్తే అసూయపడతాయి.  యజమానికి ఎప్పుడూ కాపలాగా ఉంటాయి.

9.ధనస్సు రాశి..
ఈ కుక్కలకు నడవడం ఇష్టం. అయితే.. బెల్టుతో కట్టేసి ఉండటం  వీటికి నచ్చదు.  ఫ్రీగా.. రోడ్డుపై నడవడం వీటికి ఇష్టం. అయితే.. ఈ క్రమంలో ఒక్కోసారి.. తప్పించుకొని పారిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.

10.మకర రాశి..
ఖచ్చితంగా ఒక సూపర్ ఆర్గనైజ్డ్ , బాగా శిక్షణ పొందిన కుక్క.. ఈ కుక్కలు చాలా చురుగ్గా ఉంటాయి. అయితే.. వీటికి నిత్యం శిక్షణ అవసరం. ఇతరుల కుక్కలతో ఆడుుకోనివ్వాలి.

11.కుంభ రాశి..
ఈ కుక్క చాలా తెలివైనది. మీరు వీడియో కాల్‌లో ఉన్నారని తెలిసినప్పుడు వారు కేకలు వేయదు.. కానీ.. వేరే ఇతర కుక్కలు ఉన్నాయి అని దానికి అనుమానం వస్తే చాలు.. అరుస్తూనే ఉంటుంది. దీనికి ఏదైనా శిక్షణ ఇవ్వడం సులువు. చాలా ఎక్కువగా ప్రేమను కోరుకుంటాయి..

12.మీన రాశి..
ఈ కుక్కలు ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. వారితో బాగా ఆడుకుంటాయి.  మనుషుల కాళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాటిని ఎక్కువగా పట్టించుకోవాలని కోరుకుంటూ ఉంటాయి. 

click me!