ఏ రాశి అమ్మాయిలు ఎలాంటి చెవిపోగులు పెట్టుకుంటే శుభమో తెలుసా?

First Published | Aug 1, 2024, 3:28 PM IST

జోతిష్యశాస్త్రం ప్రకారం.. వారు ధరించే చెవిపోగులు కూడా  అందరికీ అన్నీ సూట్ కావట. కొన్ని మాత్రమే శుభఫలితాలను ఇస్తాయట. మరి.. ఏ రాశివారు  ఏ లోహంతో ఉన్న చెవిపోగులు ధరించడం వారికి శుభ దాయకమో ఇప్పుడు తెలుసుకుందాం...

అమ్మాయిలకు ఆభరణాలు ఎంత అందాన్ని ఇస్తాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అమ్మాయిలకు.. చెవి పోగులు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే.. జోతిష్యశాస్త్రం ప్రకారం.. వారు ధరించే చెవిపోగులు కూడా  అందరికీ అన్నీ సూట్ కావట. కొన్ని మాత్రమే శుభఫలితాలను ఇస్తాయట. మరి.. ఏ రాశివారు  ఏ లోహంతో ఉన్న చెవిపోగులు ధరించడం వారికి శుభ దాయకమో ఇప్పుడు తెలుసుకుందాం...
 

telugu astrology


1.మేష రాశి..

మేష రాశికి చెందిన అమ్మాయిలు... బంగారం లేదంటే.. రాగి  తో చేసిన చెవిపోగులు ధరించవచ్చు. అది కూడా..వాటిని మంగళవారం ధరించడం వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మంగళవారం రోజున ధరించడం వల్ల.. వారికి   మంళ దోషం ఉన్నా.. తొలగిపోతుంది. 


telugu astrology

2.వృషభ రాశి...
వృషభ రాశికి చెందిన అమ్మాయిలు... వెండితో చేసిన చెవి పోగులు ధరించవచ్చు. అది కూడా శుక్రవారం పూట ధరించడం వారికి  చాలా మంచి చేస్తుంది. శుక్రదోషాలు ఉన్నా.. అవన్నీ తొలగిపోయే అవకాశం ఉంది.

telugu astrology

3.మిథున రాశి..

మిథున రాశిని బుధుడు పరిపాలిస్తాడు. ఈ రాశివారు పచ్చ రాళ్లు ఉన్న చెవిపోగులు, ఇత్తడివి ధరించవచ్చు. వీరు ఇవి ధరించడం వల్ల.. బుధ దోషం తొలగిపోతుంది.

telugu astrology

4.కర్కాటక  రాశి..
కర్కాటక రాశి అమ్మాయిలు వెండి, ముత్యాలతో తయారు చేసిన చెవి పోగులు ధరించవచ్చు. వీటిని మీరు సోమవారం పూట ధరించవచ్చు. దీని వల్ల వీరికి ఎక్కువ శుభఫలితాలు లభిస్తాయి.

telugu astrology

5.సింహ రాశి...
సింహ రాశి వారికి అధిపతి సూర్యుడు. కాబట్టి ఈ రాశి వారు ఇత్తడి, బంగారంతో చేసిన చెవిపోగులు ధరించాలి. ఇది వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. 

telugu astrology

6.కన్య రాశి..
కన్య రాశి వారిని బుధ గ్రహం పరిపాలిస్తుంది.  కాబట్టి ఈ రాశి కి చెందిన అమ్మాయిలు  పచ్చ రంగు  చెవిపోగులు ధరించాలి. వారికి మంచి జరుగుతుంది. 

telugu astrology

7.తుల రాశి...
తుల రాశి కి చెందిన అమ్మాయిలు..  వెండి చెవిపోగులు ధరించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.. ఇది మీకు అన్ని రంగాలలో విజయాన్ని అందించగలదు.

telugu astrology

8.వృశ్చిక రాశి..

కుజుడు వృశ్చిక రాశి వారికి అధిపతి. కావున ఈ రాశి వారు బంగారం , రాగితో చేసిన చెవిపోగులను ధరించాలి. దీంతో సంపదను పెంచుకోవచ్చు.
 

telugu astrology

9.ధనస్సు రాశి.. 
ధనుస్సు రాశి వారు బంగారం , ఇత్తడి చెవిపోగులు ధరించాలి. ఎందుకంటే ఈ రాశికి బృహస్పతి అధిపతి. ఇది మీకు ఎప్పుడూ ఎటువంటి సమస్యలను ఎదుర్కోకుండా నిర్ధారిస్తుంది.

telugu astrology


10.మకర రాశి..
మకర రాశి వారు నీలమణి చెవిపోగులు ధరించాలి. ముఖ్యంగా శనివారాల్లో దీన్ని ధరించండి. ఇది మీరు ఎప్పటికీ ఎలాంటి లోపాన్ని ఎదుర్కోకుండా నిర్ధారిస్తుంది.

telugu astrology

11.కుంభ రాశి..
కుంభ రాశికి చెందిన వారు నీలమణి చెవిపోగులు ధరించాలి. ఇది కాకుండా, మీరు డైమండ్ చెవిపోగులు ధరించవచ్చు. ఇలా చేయడం వల్ల శనిదేవుని అనుగ్రహం చెక్కుచెదరకుండా ఉంటుంది.

telugu astrology

12.మీన రాశి...
మీన రాశి వారికి అధిపతి దేవ్ గురు అంటే.. బృహస్పతి. కావున ఈ రాశి వారు బంగారు, ఇత్తడి చెవిపోగులు ధరించడం శ్రేయస్కరం. మీరు దానిని గురువారం ధరించవచ్చు.

Latest Videos

click me!