దేవుడు మనకు పుట్టుకతోనే కొన్ని బంధాలను ఇస్తాడు. మనం మన అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు బంధాలను ఎంచుకోలేం. కానీ మనం మన స్నేహితులను ఎంచుకోగలం. మన వ్యక్తిత్వానికి సూట్ అయ్యే వారిని, మనకు నచ్చిన వారితో స్నేహం చేసే అవకాశం ఉంటుంది. అయితే... మనం ఎంచుకునే స్నేహితుల విషయంలో తప్పులు చేస్తే మాత్రం ఇబ్బంది పడకతప్పదని చాణక్య నీతి హెచ్చరిస్తోంది.