Ugadi 2022: స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం.. మిథున రాశి జాతకం

First Published | Mar 30, 2022, 3:19 PM IST

స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో మిథున రాశి వారికి కొన్నిసార్లు ఇతరుల ప్రలోభాలకు లోనై తప్పులు చేసినప్పటికీ,  తొందరగానే  వాటిని సరిదిద్దుకో గలుగుతారు.  సంవత్సరమంతా రాహుగోచారం అనుకూలంగా ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

Gemini

Gemini
ఈ జాతకాన్ని ప్రముఖ జోతిష్య నిపుణులు  గొల్లపెల్లి సంతోష్ కుమార్ శర్మ తెలియజేశారు.
ఓం శ్రీ సాయి జ్యోతిష విద్యాపీఠం, ధర్మపురి, జగిత్యాల జిల్లా.
https://www.onlinejyotish.com

Gemini

Geminiఉద్యోగం
ఈ సంవత్సరం మిధున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.  ఈ సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.   అంతే కాకుండా చేసే పనికి సరైన గుర్తింపు రాకుండా ఉండటం మరియు సహోద్యోగుల నుంచి వ్యతిరేకత కాని సరైన సహకారం అందకపోవడం గాని జరగవచ్చు. ఈ సమయంలో మీ సహనాన్ని పరీక్షించే ఈ విధంగా కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది వాటిని మీరు విజయవంతంగా ఎదుర్కొంటారు.  మిమ్మల్ని తక్కువ చేసి చూసే వారిని పట్టించుకోక పోవడం వలన వలన మానసికంగా ప్రశాంతతను పొందుతారు. సంవత్సరమంతా గురు గోచారం మధ్యమంగా ఉండటం వలన, మీ పై అధికారుల సహాయం లభించడమే కాకుండా, దైవానుగ్రహం కారణంగా కూడా, మీకు ఏర్పడిన సమస్యల నుంచి బయట పడగలుగుతారు.  ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి లేదా కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.  విదేశాలలో ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సమయంలో అనుకూలమైన ఫలితం లభిస్తుంది.  సంవత్సరం మధ్యలో శని దృష్టి పదవ ఇంటిపై ఉండటం వలన మీ పని విషయంలో,  మీ ప్రవర్తనలో, ఇతరుల ప్రభావం అధికంగా ఉంటుంది దానివలన,  మీరు తరచుగా అసహనానికి, కోపానికి గురవుతారు. చేసే పనిలో అడ్డంకులు  ఎదురవడం,  పనులు ఆలస్యంగా జరగటం మొదలైనవి జరిగినప్పటికీ,  మొదలుపెట్టిన పనులను సహనంతో పూర్తి చేయగలుగుతారు.  కొన్నిసార్లు ఇతరుల ప్రలోభాలకు లోనై తప్పులు చేసినప్పటికీ,  తొందరగానే  వాటిని సరిదిద్దుకో గలుగుతారు.  సంవత్సరమంతా రాహుగోచారం అనుకూలంగా ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.  గతంలో ఉన్న మానసిక సమస్యలు,  ఆందోళనలు తొలగిపోయి ఉత్సాహంతో  పనులు పూర్తి చేయగలుగుతారు.   పదవ గురువు గోచారం కారణంగా  వృత్తి లో మార్పులు చోటు చేసుకుంటాయి.  పదోన్నతి పొందడం కానీ,  వేరే వృత్తిలోకి మారడం కానీ జరుగుతుంది.  దీని వలన గతంలో ఉన్న పని ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది.  విశ్రాంతి సమయం దొరుకుతుంది.  గతంలో ఏర్పడిన  అవమానాలు కానీ,  పుకార్లు కానీ తొలగిపోయి మీ నిజాయితీ నిరూపించబడుతుంది.  మీ సహోద్యోగులు సహాయ సహకారాలు తిరిగి పొందగలుగుతారు.  జూలై తర్వాత వక్రగతుడైన శని  అష్టమ స్థానంలో తిరిగి సంచరించడం వలన వృత్తిలో కొన్ని మార్పులు చోటు చేసుకొని అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది.  అయితే ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయగలుగుతారు.


ఆర్థిక స్థితి
 మిధున రాశిలో జన్మించిన వారికి, సంవత్సరమంతా రాహువు 11వ ఇంటిలో సంచరించటం.  ధన స్థానంపై గురు దృష్టి ఉండటం వలన ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.  డబ్బు ఖర్చు చేసినప్పటికీ తగినంత ఆదాయం ఉండటం వలన ఆర్థిక పరిస్థితి దిగజారి పోదు.  అయితే శనిగోచారం అనుకూలంగా లేకపోవటం వలన తొందరపడి  పెట్టుబడి పెట్టి వాటి వలన ఆర్థికంగా కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టుబడుల విషయంలో  ఆచితూచి అడుగు వేయడం మంచిది.   గతంలో మీరు పెట్టిన పెట్టుబడి నుంచి ఈ సమయంలో మంచి లాభాలు రావడంతో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు.  అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఇల్లు కాని, వాహనం కానీ, కొనుగోలు చేస్తారు. ఈ సంవత్సరం ఏప్రిల్ జూలై మధ్యలో శని గోచారం కూడా కొంత అనుకూలంగా ఉండటం వలన గతంలో నష్ట పోయిన డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది.  ఈ సంవత్సరం ప్రయాణాల కారణంగా కూడా మీరు డబ్బు ఖర్చు చేస్తారు. లాభ స్థానంలో రాహు సంచారం ఆర్థిక సమస్యలు తొలగిపోవటమే కాకుండా ఆర్థికంగా మెరుగైన పరిస్థితిని పొందుతారు.  గతంలో చేసిన అప్పులు కానీ,  లోన్లు కానీ ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో తీర్చ గలుగుతారు.
 

Gemini

ఆరోగ్యం
 ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో కొంత మెరుగుగా ఉంటుంది. సంవత్సరమంతా రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ, వాటిని తట్టుకునో శక్తిని కలిగి ఉంటారు. అష్టమ శని కారణంగా ఎముకలు మరియు మూత్ర పిండాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం ప్రథమార్ధంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.  గురు దృష్టి రోగస్థానంపై ఉండటం వలన పైన చెప్పిన సమస్యల్లో చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టక పోవచ్చు.  సంవత్సరమంతా రాహుగోచారం 11వ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన అది మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుంది.  ద్వితీయార్ధంలో అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ, అది మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికి గురి చేయదు. ఆరోగ్య విషయంలో, ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తలు పాటించడం,  బయట  భోజనాలు ఎక్కువ చేయకపోవడం, అలాగే శారీరక వ్యాయామాలు,  యోగా, ధ్యానం మొదలైనవి చేయటం వలన మిమ్మల్ని మీరు  రక్షించుకో గలుగుతారు.

వ్యాపారం మరియు స్వయం ఉపాధి
 ఈ సంవత్సరం వ్యాపారస్తులకు ప్రథమార్ధం కంటే ద్వితీయార్థం బాగా అనిపిస్తుంది. ప్రథమార్థంలో మిశ్రమ ఫలతాలుంటాయి. కొన్నిసార్లు లాభాలు రావటం, లాభాలు వస్తాయనుకుని పెట్టిన పెట్టుబడుల్లో నష్టాలు రావటం జరగవచ్చు.  అష్టమ శని కారణంగా వ్యాపార భాగస్వామి తో సమస్యలు రావడం కానీ లేదా వారి ద్వారా మోసపోవడం కానీ జరగవచ్చు.   మీతో  భాగస్వామిగా వ్యాపారం చేయాలని మోసపూరితమైన ఆలోచనతో కొంతమంది  మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది.  అటువంటి తప్పుడు వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.  సంవత్సరమంతా రాహువు పదకొండవ ఇంటిలో సంచరించటం అలాగే గురు దృష్టి ధన స్థానంపై ఉండటంవలన వ్యాపారంలో అభివృద్ధి సాధ్యం అవుతుంది.  ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను ఇచ్చి మీకు లాభాలను వ్యాపార అభివృద్ధి ఇస్తాయి.  స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారు,  కళాకారులు మొదలైనవారు ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు.  రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీరు మీ పనిలో బిజీ అవడమే కాకుండా ఆర్థికంగా కూడా అభివృద్ధిని సాధిస్తారు.  మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. అయితే అష్టమ శని కారణంగా ఈ సంవత్సరం చివరలో కొన్ని ఇబ్బందులకు,  అవమానాలకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చేసే పనిలో నిజాయితీగా ఉండటం మంచిది. 

Gemini

కుటుంబం
కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సరమంతా రాహు గోచారం అనుకూలంగా ఉండటం అలాగే గురు దృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వలన, కుటుంబంలో వృద్ధి జరుగుతుంది, అలాగే ఇంటిలో శుభకార్యాలు జరగడం వలన  గతంలో ఏర్పడిన మనస్పర్థలు తొలగిపోతాయి.  మీ మాటకు విలువ పెరగడమే కాకుండా, కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు పొందుతారు.  మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగు పడుతుంది.  మీ సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ప్రథమార్ధంలో మీ సోదరులు  లేదా మీ బంధువుల కారణంగా ఒక సమస్య నుంచి బయట పడగలుగుతారు.  మీ కుటుంబ సభ్యులతో కలిసి  విహారయాత్ర కానీ,  ఆధ్యాత్మిక ప్రదేశ  సందర్శనం కానీ చేస్తారు.  ఏప్రిల్ మరియు జులై మధ్యలో శని గోచారం తొమ్మిదవ ఇంట్లో ఉండటం వలన మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పంచమ స్థానం పై కేతు గోచారం కారణంగా సంతానం కు ఆరోగ్య సమస్యలు కానీ లేదా మనస్పర్థలు గాని  వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కుటుంబ స్థానంపై గురు దృష్టి కారణంగా ఈ సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టకుండా తగ్గిపోతాయి. 
 

Gemini

పరిహారములు
 ఈ సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి శనికి పరిహారాలు ఆచరించడం మంచిది.  దీని కారణంగా ఈ సంవత్సరంలో వచ్చే ఆరోగ్య,  ఆర్థిక సమస్యలు,  అలాగే కుటుంబ సమస్యలు తగ్గిపోయి ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తారు.   శని గోచారం  ఏప్రిల్ - జులై మధ్యలో తప్ప మిగిలిన సంవత్సరమంతా అష్టమ స్థానంలో ఉంటుంది కాబట్టి అష్టమ శని అవమానాలు,  ఆరోగ్య సమస్యలు,  కుటుంబ సమస్యలు,  వృత్తిలో సమస్యలు తొలగించుకోడానికి ప్రతిరోజు శని సంబంధ స్తోత్ర పారాయణం చేయడం కానీ,  లేదా హనుమాన్ చాలీసా లేదా వెంకటేశ్వర సంబంధ స్తోత్ర పారాయణం చేయడం కానీ చేయడం మంచిది.  లేదా శని మంత్ర జపం 19 వేల సార్లు చేయడం, లేదా శని గ్రహ శాంతి జరపటం మంచిది.  దానివలన శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి.  వీటితో పాటుగా శని దోష నివారణకు శారీరక శ్రమ చేయటం, వృద్ధులకు, వికలాంగులకు సాయం చేయడం మంచిది. మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ అంతర్దశలు  ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది.  పైన చెప్పిన పరిహారములు మీ శక్తి,  భక్తి మరియు శ్రద్ధ మేరకు ఏ పరిహారం అయినా పాటించవచ్చు అంతేకానీ చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.
 

Latest Videos

click me!