Date of Birth:: ఈ తేదీల్లో పుట్టిన వారితో స్నేహం చేస్తే.. మీ అదృష్టం మారడం ఖాయం.

Published : Feb 24, 2025, 02:27 PM ISTUpdated : Feb 24, 2025, 07:58 PM IST

మనం జన్మించిన సమయం ఆధారంగా మనం ఎలాంటి వాళ్లమో ఓ అంచనా వస్తుంటారు. జన్మించిన నక్షత్రం, రాశి ఆధారంగా మన వ్యక్తిత్వం ఎలాంటిది.? మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. మన జీవితం ఎలా ఉంటుంది.? లాంటి వివరాలను పండితులు చెబుతుంటారు..   

PREV
17
Date of Birth:: ఈ తేదీల్లో పుట్టిన వారితో స్నేహం చేస్తే.. మీ అదృష్టం మారడం ఖాయం.

ఈ లోకం బంధువులను దేవుడు ఇస్తాడు. ఒక్క స్నేహితులను మాత్రమే మనమే వెతుక్కుంటాం. మన ఆలోచనలకు సెట్‌ అయ్యే వారిని, మన అభిరుచులను ఇష్టపడే వారితోనే స్నేహం చేస్తాం. అయితే జీవితంలో ఎంతో మంది స్నేహితులు పరిచయమవుతుంటారు. కానీ కొందరు మాత్రమే జీవితాంతం కలిసి ఉంటారు. కొందరు స్నేహితులు మన జీవితాలను మలుపు తిప్పుతుంటారు. మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ తేదీలలో జన్మించిన వారితో స్నేహం చేస్తే ఎలా ఉంటుందన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

27
friends gathering

మార్చి 5వ తేదీన జన్మించిన వారు: 

మార్చి 5వ తేదీన జన్మించిన వారు మీ స్నేహితులుగా ఉంటే మీరు విజయాన్ని తప్పక అందుకుంటారు. ఎందుకంటే వీరిలో నైపుణ్యత ఎక్కువగా ఉంటుంది. లక్ష్యం కోసం పనిచేస్తుంటారు. మరీ ముఖ్యంగా వీరిలో తప్పుడు అలవాట్లు ఉండవు. ఇలాంటి వారితో స్నేహం చేసే వారిని కూడా తమలాగే ఉండాలని చూస్తుంటారు. ఇతరులకు ఆదర్శంగా ఉంటారు. 
 

37

ఏప్రిల్‌ 19వ తేదీ: 

ఈ తేదీలో పుట్టిన వారితో స్నేహం వరంలాంటిదని చెప్పాలి. వీరు ఎంతో సహనంగా ఉంటారు. పరిస్థితులను చేజారిపోకుండా చూసుకుంటారు. జాగ్రత్తగా ఉంటారు. వీరు స్నేహంలో నిజాయితీగా ఉంటారు. 
 

47

జూలై 22వ తేదీ: 

ఈ తేదీలో జన్మించిన వారు స్నేహానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితుడు కష్టంలో ఉంటే ఎంతకైనా తెగిస్తారు. ఆపాదలో ఉన్న స్నేహితుడికి అండగా నిలుస్తారు. వీరితో స్నేహం చేస్తే చాలా మంచిది. 
 

57

ఆగస్టు 17వ తేదీ: 

ఈ తేదీలో పుట్టిన వారు నిజాయితీగా ఉంటారు. మంచి వైపు ఉండే లక్షణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనిని పూర్తి చేసేదాక వదిలిపెట్టరు. తమ స్నేహితులు కూడా వీరిలాగే కష్టపడి పనిచేయాలని కోరుకుంటారు. ఆ దిశగా ప్రోత్సహిస్తుంటారు. 

67

అక్టోబర్‌ 2వ తేదీ: 

అక్టోబర్ 2వ తేదీన జన్మించిన వారు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. ఆపదలో ఉన్న స్నేహితులకు భరోసా కల్పిస్తారు. కేవలం తమ చేతలతోనే కాకుండా మాటలతో కూడా ధైర్యాన్ని నింపుతారు. ఇలాంటి వారు పక్కన ఉంటే బిందాస్‌గా ఉంటుంది. 
 

77

డిసెంబర్‌ 15వ తేదీ: 

ఈ తేదీన పుట్టిన వారితో స్నేహం చేస్తే సంతోషం ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉంటుంది. వీరు ఇతరులను అస్సలు బాధపెట్టరు. కష్టపడి పనిచేసే తత్వం ఉంటుంది. కెరీర్‌ గురించి మంచి కలలు కంటారు. భవిష్యత్తులో ఏదైనా సాధించాలనే కసితో ఉంటారు. తమ స్నేహితులు కూడా అలాగే ఉండాలని తపనపడుతుంటారు. స్నేహితుడి విజయంలో తమ విజయాన్ని వెతుక్కుంటారు. 

నోట్‌: పైన పేర్కొన్న వివరాలు కేవలం పలువురు పండితులు, శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి. 
 

click me!

Recommended Stories