కొత్త ఇళ్లు కొంటున్నారా..? వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!

First Published | Nov 1, 2023, 1:45 PM IST

రోడ్డుకి చివరగా ఉండే ఇంటిని  పొరపాటున కూడా కొనుగోలు చేయకూడదు. ఎందుకంటే, వాస్తు ప్రకారం ఇలాంటి ఇంటి ఇల్లు కొనుగోలు చేయడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

సొంతిల్లు అనేది చాలా మంది కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి చాలా మంది చాలా కష్టపడుతుంటారు. తీరా కొంత డబ్బు సంపాదించిన తర్వాత, మంచి ఇల్లు కట్టుకోవడం లేదంటే, కొనుక్కోవడం లాంటివి చేస్తారు. అయితే, ఇల్లు కొనేటప్పుడు, కట్టుకునే సమయంలో వాస్తు ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం...
 


ఒక రెసిడెన్షియల్ కాలనీలో చివరగా ఉన్న ఇంటిని ఎప్పుడూ కొనుగోలు చేయకూడదు. అంతేకాదు. రోడ్డుకి చివరగా ఉండే ఇంటిని  పొరపాటున కూడా కొనుగోలు చేయకూడదు. ఎందుకంటే, వాస్తు ప్రకారం ఇలాంటి ఇంటి ఇల్లు కొనుగోలు చేయడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
 


ఇంటిని కట్టుకునేటప్పుడు, కొనుగోలు చేసేటప్పుడు పక్కన ఉన్న పరిసరాలను కూడా గమనించుకోవాలి.  పొరపాటున కూడా డ్రైనేజ్ పక్కనే ఉన్న ప్లేస్ లో ఇల్లు కట్టుకోవడం కానీ, కొనుగోలు కానీ చేయకూడదు. ఇది వాస్తు ప్రకారమే కాదు, ఆరోగ్య పరంగా కూడా మంచిది కాదు.
 

ఇరుకు సందులు, రోడ్లు ఉన్న దగ్గర ఇల్లు కొనుగోలు చేయడం, కట్టుకోవడం కూడా మంచిది కాదు. వాస్తు ప్రకారం ఈ ఇంటి వల్ల ఉపయోగం కంటే సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
 

ఇక, ఇంటిని కొనుగోలు చేసే సమయంలో మీరు జోతిష్య్కుడిని కలిసి , మీ పేరుతో ఆ ఇంటి వాస్తుకు సెట్ అవుతుందో లేదో కూడా చూసుకోవాలి. అది కూడా వాస్తు ప్రకారం ముఖ్యంగా పాటించాల్సిన నియమం.

కేవలం, ఇంటిని మాత్రమే కాదు, స్థలం కొనుగోలు చేసే సమయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. త్రిభుజాకారంలో ఉన్న స్థలం, ఇంటిని కొనుగోలు చేయడం మంచిది కాదు.

చాలా మంది ఇంటి మొయిన్ డోర్ దగ్గర అందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే, ఆ క్రమంలో కొన్ని పొరపాట్లు చేయకూడదు. మొయిన్ డోర్ దగ్గర గార్డెన్, కిచెన్, వాటర్ ఫౌంటైన్ లాంటివి పొరపాటున కూడా ఉంచకూడదు.అంతేకాదు, బౌండరీ వాల్ కట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి.
 

ఇక, మీ ఇంటి పై  వాటర్ ట్యాంక్ నీడ పడకుండా చూసుకోవాలి. అంతేకాదు, దేవాలయం నీడ కూడా ఇంటిపై పడకుండా చూసుకోవాలి. 

Latest Videos

click me!