సందర్భం, శుభకార్యం ఏదైనా ఇంటికి మహిళలు కళ తీసుకువస్తారు. ఇంటిని అందంగా అలంకరించడమే కాదు, తాము కూడా అందంగా ముస్తాబౌతారు. మరో పది రోజుల్లో దేశ వ్యాప్తంగా ప్రజలు దీపావళి పర్వదినం జరుపుకుంటారు. అయితే, ఆ దీపావళి పండగ రోజు జోతిష్యశాస్త్రం ప్రకారం, ఏ రాశి మహిళలు, ఏ రంగు చీర కట్టుకుంటే శుభం జరుగుతుందో తెలుసుకుందాం...
telugu astrology
1.మేష రాశి..
మేష రాశిని అంగారకుడు పరిపాలిస్తూ ఉంటాడు.ఈ రాశికి చెందిన మహిళలు, దీపావళి పండగ రోజున ఎరుపు రంగు లేదంటే, నారింజ రంగు చీర ధరించడం ఉత్తమం. ఈ రాశివారికి శుభం జరుగుతుంది.
telugu astrology
2.వృషభ రాశి..
వృషభ రాశిని శుక్రుడు పరిపాలిస్తూ ఉంటాడు. ఈ రాశికి చెందిన మహిళలు ఈ దీపావళి పండగ రోజున లేత గులాబి రంగు లేదంటే, ఆకుపచ్చ రంగు చీర ధరించవచ్చు. ఈ రెండు రంగుల దుస్తులు ధరించడం వల్ల ఈ రాశివారికి శుభం జరుగుతుంది.
telugu astrology
3.మిథున రాశి..
మిథున రాశిని బుధ గ్రహం పరిపాలిస్తూ ఉంటుంది. ఈ రాశికి చెందిన మహిళలు ఈ దీపావళి పండగ రోజున ఆకుపచ్చ రంగు చీర ధరించడం ఉత్తమం. ఈ రంగు ధరించడం వల్ల, ఈ రాశి మహిళలకు శుభం కలుగుతుంది.
telugu astrology
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశిని చంద్రుడు పరిపాలిస్తాడు. కాబట్టి, ఈ రాశివారు బ్రైట్ కలర్స్ ధరించడం ఉత్తమం. బ్రైట్ కలర్స్ ఈ రాశివారికి దీపావళి వేళ ధరించడం వల్ల ఉత్తమం గా ఉంటుంది.
telugu astrology
5.సింహ రాశి..
సింహ రాశి వారిని సూర్యుడు పరిపాలిస్తాడు. ఈ రాశివారు దీపావళి పర్వదినం రోజున ఎరుపు, ఆరెంజ్, గోల్డెన్ కలర్ చీరలు ధరించడం ఉత్తమం. ఈ రాశివారికి మంచి జరుగుతుంది.
telugu astrology
6.కన్య రాశి..
కన్య రాశిని బుధ గ్రహం పరిపాలిస్తూ ఉంటుంది. కాబట్టి, ఈ రాశివారు దీపావళి పండగ రోజున పసుపు, ఆకుపచ్చ రంగు చీరలు ధరించడం ఉత్తమం. ఈ రాశివారికి శుభ ప్రదం అవుతుంది.
telugu astrology
7.తుల రాశి..
తుల రాశివారిని వీనస్ గ్రహం పరిపాలిస్తూ ఉంటుంది. ఈ రాశికి చెందిన మహిళలు సిల్వర్, లైట్ పింక్, పింక్ కలర్ డ్రెస్సులు లేదంటే, చీరలు ధరించవచ్చు. ఇలా ధరించడం వల్ల ఈ రాశివారికి శుభం కలుగుతుంది.
telugu astrology
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశి కి చెందిన మహిళలు ఈ దీపావళి పండగ రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించడం ఉత్తమం. కుదిరితే, ఎరుపు రంగు గాజులు కూడా మ్యాచింగ్ చేయడం కూడా మంచిది. మీకు శుభం కలుగుతుంది.
telugu astrology
9.ధనస్సు రాశి..
ధనస్సు రాశి ని జూపిటర్ పాలిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశికి చెందిన మహిళలు పసుపు రంగు లేదంటే, గోల్డెన్ కలర్ చీరలు, లెహంగా, డ్రెస్ ధరించవచ్చు. ఈ రంగులు ఈ రాశివారికి శుభం కలుగుతుంది.
telugu astrology
10.మకర రాశి..
మకర రాశి వారిని శని గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఈ రాశికి చెందిన మహిళలు నీలి రంగు చీరలు, డ్రెస్ ధరించడం ఉత్తమం. ఈ రాశివారికి శుభం కలుగుతుంది.
telugu astrology
11.కుంభ రాశి..
కుంభ రాశివారిని శని గ్రహం పాలిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఈ రాశి నీటికి సంకేతం. కాబట్టి, ఈ రాశివారు కూడా ఈ దీపావళి పండగ రోజున నీలి రంగు చీర ధరించడం వల్ల శుభం కలుగుతుంది.
telugu astrology
12.మీన రాశి..
మీన రాశిని జ్యూపిటర్ గ్రహం పాలిస్తూ ఉంటుంది. కాబట్టి, ఈ రాశివారు పసుపు రంగు, బంగారు రంగు చీరలు ధరించడం ఉత్తమం. ఈ రాశివారికి ఈ రంగు చీరలు ధరించడం వల్ల శుభం కలుగుతుంది.