Zodiac signs: ఈ రాశుల వారికి పొరపాటున కూడా అబద్ధం చెప్పొద్దు, ఈజీగా దొరికేస్తారు..!

Published : Apr 05, 2026, 07:38 PM IST

Zodiac signs: ప్రతి రాశికీ ప్రత్యేకమైన వ్యక్తిత్వ లక్షణాలు, సామర్థ్యాలు ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రాశులవారు ఇతరులు చెప్పే అబద్ధాలను ఇట్టే పసిగట్టగలరు. ఆ రాశులేంటో చూద్దామా… 

PREV
15
వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి వారిని మోసం చేయడం అంటే నిప్పులో చెయ్యి పెట్టడం లాంటిదే. ఈ రాశి వారిలో ఓ స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. ఎక్స్ రే కళ్లతో అన్నీ పసిగట్టగలరు. మీరు మాట్లాడే మాటల కంటే ఎక్కువగా, మీ కళ్లు ఎటు చూస్తున్నాయో, మీ చేతులు ఎలా కదులుతున్నాయో వారు నిశితంగా గమనిస్తారు. చిన్న అనుమానం కలిగినాలు చాలు, దాని మూలాలను తవ్వి, నిజాన్ని బయటకు తీయడంలో వీరు చాలా నేర్పరులు. ఎదుటి వ్యక్తి చిన్న అబద్ధం చెప్పినా.. వీరు వెంటనే పసిగట్టగలరు. వీరి దగ్గర అబద్ధం చెప్పి తప్పించుకోవడం చాలా కష్టం.

25
2.కన్య రాశి...

కన్య రాశికి బుధుడు అధిపతి. ఈ రాశివారికి తెలివితేటలు చాలా ఎక్కువ. వీరి మెదడు చాలా చురుకుగా పని చేస్తుంది. వీరు ఎదుటివారు చెప్పే అబద్ధాలను చాలా ఈజీగా పసిగట్టగలరు. వీరి మెదడు కంప్యూటర్ లా పని చేస్తుంది. లై డిటెక్టర్ లా వీరి మెదడు పని చేస్తుంది. ప్రశ్నలతో కన్ఫ్యూజ్ చేసి మరీ.. ఇతరులు చెప్పే అబద్ధాలను చాలా ఈజీగా కనిపెడతారు.

35
3.మిథున రాశి...

మిథున రాశివార అందరితోనూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. కానీ.. వీరు ఇతరులు చెప్పే అబద్ధాలను మాత్రం ఈజీగా కనిపెడతారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఈజీగా అర్థం చేసుకునే సామర్థ్యం వీరిలో ఉంటుంది. ఎదుటి వ్యక్తి ఎంత నమ్మకంగా , నమ్మించేలా చెప్పినా కూడా వీరు అందులో ఉన్న అబద్ధాన్ని కనిపెట్టేస్తారు. వీరికి అబద్ధాలు చెప్పి తప్పించుకోవడం అంత ఈజీ కాదు.

45
4.మకర రాశి...

మకర రాశివారు చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తారు. వీరిని మాటలతో, చేసే పనులతో , కథలతో మోసం చేయడం చాలా కష్టం. మీరు ఆందోళనగా ఉన్నప్పుడు లేదా మీ గొంతు వణుకుతున్నప్పుడు వారు చాలా ప్రశాంతంగా గమనిస్తారు. చిన్న అబద్ధం అయినా ఈజీగా కనిపెట్టగలరు. ఒక్కసారి ఈ రాశివారికి అబద్ధం చెప్పి దొరికిపోతే.. మళ్లీ వీరి నమ్మకం పొందడం అంత ఈజీ కాదు.

55
5.కుంభ రాశి...

కుంభ రాశివారు చాలా తెలివిగా ఉంటారు. ఈ రాశివారు ఎదుటివారి వ్యక్తిత్వాన్ని ఈజీగా పసిగట్టగలరు. అంతేకాదు.. చిన్న అబద్ధం చెప్పినా ఈజీగా కనిపెట్టగలరు. అంతేకాదు.. ఒక్కసారి వీరికి అబద్ధం చెప్పి దొరికితే మళ్లీ వీరి నమ్మకాన్ని గెలవలేరు. మీరు కొంచెం కంగారుపడినా కూడా వీరు కనిపెట్టగలరు.

Read more Photos on
click me!

Recommended Stories