వృషభ రాశి...
వృషభ రాశివారికి జులై నెల అద్భుతంగా ఉండనుంది. శుక్రుడు, బుధుడు, శని మూడు గ్రహాలు ఈ రాశికి శుభ స్థానంలో కదులుతున్నాయి. దీని కారణంగా వీరికి ఈ నెలంతా చాలా బాగుంటుంది. కొత్త ఇల్లు, వాహనం, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఏ పని చేసినా విజయం అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తుున్నాయి.ఆదాయం కూడా పెరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నవారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలోనూ బాగా కలిసొస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.