Published : Aug 23, 2022, 11:18 AM ISTUpdated : Aug 23, 2022, 11:28 AM IST
మనకు వారిపై కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం గుర్తుండిపోతుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం.. మనకు ఏ రాశివారిని చూసినప్పుడు కామన్ గా అందరికీ కలిగే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటో ఓసారి చూద్దాం..
ఒక మనిషిని చూడగానే.. మనకు ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఒకటి కలుగుతుంది. ఆ తర్వాత వారితో పరిచయం పెరిగితే... ఆ ఇంప్రెషన్ కొందరిపై అలానే ఉంటుంది.. మరి కొందరిపై మారుతూ ఉంటుంది. కానీ.. మనకు వారిపై కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం గుర్తుండిపోతుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం.. మనకు ఏ రాశివారిని చూసినప్పుడు కామన్ గా అందరికీ కలిగే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటో ఓసారి చూద్దాం..
213
1.మేష రాశి..
ఈ రాశివారు అందరిపై యజమానిలా గా ప్రవర్తించినట్లు అనిపిస్తుంది. కానీ.. వారు తమ పని పూర్తి చేస్తారు. ఎంతటి పనినైనా వారు పూర్తి చేయగలరు. వీరిలో విశ్వాసం అందరికీ నచ్చేస్తుంది.
313
2.వృషభ రాశి..
ఈ రాశివారిని మొదటిసారి చూడగానే చాలా కామ్ పర్సన్ , చాలా స్వీట్ పర్సన్ అనే ఫీలింగ్ అందరిలోనూ కలుగుతుంది. ఈ రాశివారిని చూసినప్పుడు.. ఎవరికైనా ఈ భావనే కలుగుతుంది.
413
3.మిథున రాశి..
మిథున రాశివారిని చూడగానే ఎవరికైనా చాలా సరదా మనిషి అనే విషయం అనే ఇంప్రెషన్ కలుగుతుంది. వీరు చాలా సరదాగా ఉండటంతో పాటు.. ఇతరులకు అదే విషయంలో కోపం కూడా తెప్పిస్తారనిపిస్తుంది.
513
4.కర్కాటక రాశి..
ఈ రాశివారు అందరితోనూ చాలా మంచిగా ఉంటారు.. ఎవరైనా నెర్వస్ గా ఉంటే.. వారిలోని ఆ భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తారు అనే భావన కలుగుతుంది.
613
5.సింహ రాశి..
సింహ రాశివారిని చూసిన ఫస్ట్ ఇంప్రెషన్ లో వీరు చాలా మంచి వారని.. వీరికి తమకు ఇష్టమైన వారి దగ్గర నుంచి చిన్న కౌగిలింత లభిస్తే చాలు అని కోరుకుంటారని అనిపిస్తుంది.
713
6.కన్య రాశి..
కన్య రాశివారిని చూడగానే ఎవరికైనా ఫస్ట్ ఇంప్రెషన్... వీరికి ఎంత సిగ్గు ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. అయితే.. ఈ రాశివారికి టాలెంట్ కూడా ఎక్కువ అనే విషయం అర్థమౌతుంది.
813
7.తుల రాశి..
తుల రాశివారిని చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ లో వారిపై మంచి ఓపినియన్ కలిగే అవకాశం చాలా తక్కువ. కానీ... ఈ రాశివారు చాలా తెలివిగల వారు అనే అభిప్రాయం మాత్రం కలుగుతుంది.
913
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారిని చూడగానే మొదటి ఇంప్రెషన్ లో కొందరికి వీరు చాలా రూడ్ గా కనిపించే అవకాశం ఉంది. మరి కొందరికి మాత్రం చాలా క్యూట్ గా అనిపించే అవకాశం ఉంది. అయితే.. వాళ్లు మీకు మొదటి సారి ఎలా కనిపిస్తారు అనే దానిపై ఈ ఇంప్రెషన్ ఆధారపడి ఉంటుంది.
1013
9.ధనస్సు రాశి...
ధనస్సు రాశివారు ఫస్ట్ ఇంప్రెషన్ లోనే కొందరికి చాలా చులకనగా కనిపిస్తారు. కానీ.. చాలా అద్భుతంగా కనిపిస్తారు. కానీ కొందరికీ వింతగా కూడా కనిపించవచ్చు.
1113
10.మకరరాశి..
ఈ రాశివారు ఫస్ట్ ఇంప్రెషన్ లోనే అందరికీ వెంటనే నచ్చేస్తారు. కానీ ఒక్కోసారి ఈ రాశి వారు చాలా పిచ్చిగా కూడా కనపడవచ్చు. ఎందుకంటే ఈ రాశివారికి ప్రేమగా ఉండగలరో.. అంతే కోపంగా కూడా ఉంటారు.
1213
11.కుంభ రాశి..
కుంభ రాశివారు ఫస్ట్ ఇంప్రెషన్ లోనే చాలా చమత్కారమైన వ్యక్తిగా కనపడతారు. కానీ ఒక్కోసారి కొందరికి ఈ రాశివారు మొండిగా కూడా కనపడవచ్చు. కానీ.. ఈ రాశివారిని చూడగానే ఎవరైనా ఇష్టపడతారు.
1313
12.మీన రాశి..
మీన రాశివారు ఫస్ట్ ఇంప్రెషన్ లో చాలా మందికి వింతగా కనిపించే అవకాశం ఉంది. ఈ రాశివారు.. తమ టాలెంట్స్ తో అందరినీ ఇంప్రెస్ చేయాలని చూస్తారు. వీరిని చూడగానే ఎవరికైనా వారి గురించి అదే అనిపిస్తుంది.