కాలికి నల్లదారం ఎందుకు కట్టుకుంటారు?

First Published | Feb 20, 2024, 9:54 AM IST

చాలా మంది చేతులు, కాళ్లకు నల్ల దారాన్ని కట్టుకోవడం మీరు చూసే ఉంటారు. అయితే దీన్ని కట్టుకున్న వారు కొన్ని నియమాలను పాటించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. లేదంటే మీరు ఎన్నో సమస్యల బారిన పడొచ్చు. 

మనలో చాలా మంది కాలికి, చేతికి నల్ల దారాన్ని కట్టుకునే ఉంటార. నిజానికి నల్లదారం ఎన్నో కారణాల వల్ల పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. నల్ల దారం చెడు కంటి నుంచి కూడా రక్షిస్తుందని, సంతోషాన్ని కలిగిస్తుందని నమ్ముతారు.

బ్లాక్ థ్రెడ్ ప్రతికూల శక్తిని గ్రహిస్తుందని జ్యోతిష్యులు చెప్తారు. అలాగే ఇది మీలో సానుకూలతను నింపడానికి కూడా సహాయపడుతుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది బ్లాక్ థ్రెడ్ ను ఫ్యాషన్ సింబల్ గా కూడా ఉపయోగిస్తున్నారు. కానీ దీన్ని కట్టుకున్న తర్వాత మీరు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది.  లేదంటే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్లాక్ థ్రెడ్ ను కట్టుకున్నవారు ఎలాంటి నియమాలను పాటించాలంటే?

black thread - Astrology

నల్ల దారాన్ని కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

కాలికి నల్ల దారాన్ని కట్టే పద్ధతి చాలా కాలంగా కొనసాగుతోంది. శాస్త్రాల ప్రకారం.. నల్ల దారాన్ని కట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇది ఒక వ్యక్తి జీవితాన్ని మెరుగుపరుస్తుంది. ప్రధానంగా చిన్నపిల్లల చేతులు, కాళ్లకు నల్లని దారాన్ని కట్టడం వల్ల వారికి చెడు కంటి ప్రభావం ఉండదు. పిల్లలే కాదు పెద్దలు కూడా నల్ల దారాన్ని కట్టుకోవడం వల్ల ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఉండదు.
 



బ్లాక్ థ్రెడ్ కట్టుకునేటప్పుడు చేయకూడని తప్పులు

మీరు శరీరంలోని ఏ భాగంలోనైనా నల్ల దారాన్ని కట్టుకుంటే చిన్నచిన్న పొరపాట్లకు కూడా దూరంగా ఉండాలని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది. అవేంటంటే? 

థ్రెడ్ ను మార్చడం

బ్లాక్ థ్రెడ్ ను తరచూ మార్చకూడదు. మీరు నల్ల దారాన్ని కట్టినప్పుడల్లా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు ఈ దారాన్ని పదేపదే మార్చడం వల్ల దాని ప్రభావం తగ్గుతుంది. నల్ల దారాన్ని కట్టిన తర్వాత దానిని మార్చకుండా ఉండండి. 

పాత, ముక్కలు చేసిన దారాన్ని ధరించడం

పాతది, కట్ అయిన నల్ల దారాన్ని ఎప్పుడూ కట్టుకోకూడదు. నిజానికి దెబ్బతిన్న దారం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. అందుకే ఇలాంటి దారాన్ని ఒకవేళ మీరు కట్టుకున్నట్టైతే వెంటనే ఈ దారాన్ని తీసేయండి. 

ఇతరులతో పంచుకోవడం

జ్యోతిషశాస్త్రపరంగా.. నల్ల దారం ఒక వ్యక్తి శక్తికి వ్యక్తిగతమైనది. అలాగే ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. దాని వ్యక్తిగత జ్యోతిష ప్రభావాన్ని కొనసాగించడానికి ఇతరులతో దీన్ని పంచుకోవడం మానుకోండి.
 

Black Thread

పరిశుభ్రతపై శ్రద్ధ చూపకపోవడం..

నల్ల దారం కట్టుకున్న వారు ఖచ్చితంగా పరిశుభ్రత పాటించాలి. లేకపోతే మీకు అది ప్రయోజనం కంటే హాని ఎక్కువగా కలిగించడం ప్రారంభిస్తుంది. నల్లదారం శని గ్రహానికి చిహ్నమని, దీన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే శని దోషం ఏర్పడుతుందని నమ్ముతారు. ఇది మీ శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. 

Black thread on feet

బ్లాక్ థ్రెడ్ ధరించేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

మీరు నల్ల దారం కట్టుకున్న చోట వేరే ఇతర రంగు దారాలకు కట్టుకోకూడదు. నలుపు దారాన్ని ఒంటరిగా కట్టుకున్నప్పుడు మాత్రమే దాని ప్రభావాలను చూపుతుంది.

శనిదేవుని రోజైన శనివారం నాడు నల్ల దారాన్ని ఎల్లపూ కట్టుకోకండి. నలుపు రంగు శనికి చిహ్నంగా పరిగణించబడుతుంది. దీని పూర్తి ఫలితాలను పొందడానికి మీరు దీనిని మంచి రోజునే కట్టుకోవాలి.  శని, సోమవారాలు లేదా నిర్దిష్ట గ్రహ సంచార సమయంలో నల్ల దారాన్ని ధరించడానికి శుభ సమయంగా భావిస్తారు.

benefits of wearing black thread 01

నల్ల దారాన్ని కట్టేటప్పుడు గాయత్రి మంత్రాన్ని పఠించాలి. దీంతో దాని వల్ల పూర్తి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే మిమ్మల్ని మీరు చెడు దృష్టి నుంచి కాపాడుకోగలుగుతారు. 

నల్ల దారాన్ని కట్టుకోవడానికి సంబంధించిన జ్యోతిష పద్ధతులు, వివిధ సంస్కృతులు,  జ్యోతిష సంప్రదాయాల మధ్య భిన్నంగా ఉండొచ్చు. జ్యోతిష్కులను సంప్రదించిన తర్వాతే నల్ల దారాన్ని కట్టుకోవాలి. 

Latest Videos

click me!