Today Horoscope: ఓ రాశివారికి రావలసిన ధనం అందుతుంది

First Published | Feb 20, 2024, 5:30 AM IST

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు.. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. సమాజంలో  కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. 

20-2-2024 మంగళవారం మీ  రాశి ఫలాలు  (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

మేషం (అశ్విని 1 2 3 4 భరణి 1 2 3 4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు) వ్యాపారంలో ధన లాభం పొందగలరు. నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు.ఆశించిన ధన లాభం పొందగలరు.

భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు) వ్యాపారములో జాగ్రత్త అవసరం. సమాజంలో అవమానాలు కలుగ గలవు.చేయు వ్యవహారాల్లో కోపం అధికంగా ఉంటుంది .

కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)శారీరక బాధలు పెరుగుతాయి.అధికారుల వలన భయాందోళన గా ఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు పడతారు.

దిన ఫలం:-అనవసరమైన ఆలోచనలు కలుగుతాయి.పనుల్లో ఇతరుల సహాయంతో పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాలలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. సంఘంలో ప్రతికూలత వాతావరణ.ఊహించని ఖర్చులు ఎదురవుతాయి.వాహన ప్రయాణంలో  జాగ్రత్త అవసరం. వ్యవహారాల్లో కఠినంగా వ్యవహరిస్తారు. చేసే పనుల్లో తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదురవుతాయి.ఓం శ్రీ వేంకటేశ్వరాయ నమః  అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 


telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు) సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును.

దిన ఫలం:-విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.స్థిరాస్తి అభివృద్ధి ఆలోచనలు కలసి వస్తాయి.తలపెట్టిన పనులు అనుకూలంగా పూర్తి కాగలవు.వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. రావాల్సిన బకాయిలు వసూలగును.పోయిన వస్తువులు దొరుకుతాయి.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.దానధర్మాలు చేస్తారు.సమాజంలో పెద్దల యొక్క ఆదరణ అభిమానులు పొందగలరు.ఓం శ్రీ రుద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర 1 2 3 4 పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని) మానసిక చికాకులు.ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. చేసే పనుల్లో కోపం అధికంగా ఉండును. సమాజంలో అపవాదము రాగలవు.

పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు ) ఇతరులతో అకారణంగా విరోధాలు రాగలవు. వ్యాపారంలో ధన నష్టం. పనుల్లో ఆటంకాలు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. సమాజంలో  కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కనబడుతుంది.రావలసిన బాకీలు వసూలు అవుతాయి.నూతన అనుబంధాలు పెరుగుతాయి. చేసే వ్యవహారములో దూర దృష్టితో చేస్తారు.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు) బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది .

ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు) బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారంలో ధన లాభం .అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

దిన ఫలం:-దేవాలయ సందర్శన. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందగలరు. బంధుమిత్రుల కలయిక.ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. శుభవార్తలు వింటారు. శుభ కార్యాలోచనము చేస్తారు. తలపెట్టిన పనుల్లో ఎన్ని కష్టాలు ఎదురైనా పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. చేసే ఖర్చు యందు జాగ్రత్త అవసరం. సంఘంలో  గౌరవ హోదాలో పెరుగుతాయి. ఓం షణ్ముఖాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

telugu astrology

సింహం (మఖ 1 2 3 4 పుబ్బ 1 2 3 4 ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు) వ్యాపారంలో ధన లాభం.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు.ఆశించిన ధన లాభం పొందగలరు.

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు) వ్యాపారములో జాగ్రత్త అవసరం. సమాజంలో అవమానాలు కలుగ గలవు.చేయు వ్యవహారాల్లో కోపం అధికంగా ఉండును

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి) శారీరక బాధలు పెరుగుతాయి. అధికారుల వలన భయాందోళన గా ఉంటుంది.తలపెట్టిన పనుల్లో  ఇబ్బందులు ఎదురవుతాయి.

దిన ఫలం:-శుభవార్తలు వింటారు.బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభ కార్యాలకు శ్రీకారం చేస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. మానసిక ప్రశాంతత లభించును.విద్యార్థులకు అనుకూలం.అధికారుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఓం శశి ధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.వృత్తి వ్యాపారాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు) సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును

దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. అకారణంగా కోపం వస్తుంది.అనవసర ఖర్చులు పెరుగుతాయి.పనుల్లో నిరాసక్తత.సేవకుల వలన కొద్దిగా ఇబ్బందులు పడతారు.సంఘంలో వాదోపవాదములు రాగలవు.గృహ సంబంధిత పనుల్లో ఆటంకాలు.శారీరకమైన బాధలు పెరుగుతాయి.మనస్సులో అనేకమైన ఆలోచనలతో చికాకుగా ఉంటుంది. ఓం హేరంబాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి 1 2 3 4 విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని) మానసిక చికాకులు.ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. చేసే పనుల్లో కోపం అధికంగా ఉండును.అపవాదము రాగలదు.

విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )ఇతరులతో అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. వ్యాపారంలో ధన నష్టం. పనుల్లో ఆటంకాలు.

దిన ఫలం:-అనవసరమైన గొడవలు ఏర్పడతాయి.మానసిక ఒత్తిడి పెరుగుతుంది.చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి.కష్టించిన పనుల్లో లాభం చేకూరును. ఉద్యోగాలలో అధికారులు తో  సమస్యలు రావచ్చు. అవసరమైన ఆలోచనలు కలుగుతాయి. వ్యాపారంలో ధన నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.జీవిత భాగస్వామితో మనస్పర్థలు రాగలవు. క్షణిక ఆవేశానికి గురి అవుతారు.వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం. ఓం మహాకాళ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు) బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత.

జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు) బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారంలో ధన లాభం .అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

దిన ఫలం:-శుభవార్తలు వింటారు.మొండి బాకీలు వసూలు అవుతాయి. కళల యందు ఆసక్తి చూపుతారు. స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. మానసికంగా శారీరకంగా ఆనందంగా గడుపుతారు. ఎంతటి పని అయినా అతి సులువుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందుతారు. చేసే వ్యవహారంలో పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

telugu astrology


ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు) వ్యాపారంలో ధన లాభం. నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు.ఆశించిన ధన లాభం పొందగలరు.

పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు) వ్యాపారములో జాగ్రత్త అవసరం. సమాజంలో అవమానాలు కలుగ గలవు.చేయు వ్యవహారాల్లో కోపం అధికంగా ఉండును

ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి) శారీరక బాధలు పెరుగుతాయి.అధికారుల వలన భయాందోళన గా ఉంటుంది.తలపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.

దిన ఫలం:-బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాల్లో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. నూతన పరిచయాలు కలిసి వస్తాయి.అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నూతన ఆలోచనలు చేస్తారు.వస్తు వాహనాలు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రావాల్సిన బకాయిలు వసూలగును.సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు.ఓం విజయలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు) వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు) సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును

దిన ఫలం:-అనుకోని కలహాలు రాగలవు. ప్రయాణాలు వలన చిరాకుగా ఉంటుంది. చెడుస్నేహాలు కు దూరంగా ఉండాలి.వ్యాపార అభివృద్ధి కి చర్చలు జరుపుతారు. కష్టపడి చేసిన పనిలో విజయం సాధిస్తారు.వ్యవహారాలు చాకచక్యంతో సరి చేసుకుని ముందుకు సాగాలి.అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగాలలో చిక్కులు.అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడతాయి.ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని) మానసిక చికాకులు.ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. చేసే పనుల్లో కోపం అధికంగా ఉండును. అపవాదము రాగలవు.

పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు ) ఇతరులతో అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. వ్యాపారంలో ధన నష్టం. పనుల్లో ఆటంకాలు.

దిన ఫలం:-వృత్తి వ్యాపార వ్యవహారాలలో ధన లాభం పొందుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి.నూతన వ్యక్తుల ను కలుస్తారు.శుభవార్తలు వింటారు.బంధు మిత్రులతో  విందు వినోదాలలో ఆనందంగా గడుపుతారు.సంఘంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. తలపెట్టిన కార్యములు పూర్తి కాగలవు.రావలసిన బాకీలు అందుతాయి. ఉద్యోగాలలో  అధికారులు మన్ననలు పొందగలరు. ఓం శ్రీనివాసాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు) బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు) బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారంలో ధన లాభం .అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

దిన ఫలం:-ఉద్యోగ అధికారులు తో విభేదాలు రాగలవు.మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.స్వయంకృషితో కష్టపడి పనుల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ   వ్యవహారాలు సానుకూలంగా నుండును.చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. సమాజంలో అవమానాలు కలుగును.వ్యాపారంలో ఆకస్మికముగా నష్టాలు రాగలవు. ఓం మిత్రాయ నమః అని శుభ ఫలితాలను పొందండి

Latest Videos

click me!