ఇలాంటి కలలు పడితే ఎవరికీ చెప్పకండి.. ఒకవేళ చెప్పారో..!

First Published | Oct 6, 2023, 10:28 AM IST

జ్యోతిష్యుల ప్రకారం.. కలలు మన భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయి. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. కలలో కనిపించే సంఘటలను మన  భవిష్యత్తు శుభ లేదా అశుభ సంకేతాల గురించి వెళ్లడిస్తాయి. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. కొన్ని కలలను పొరపాటున కూడా ఇతరులతో చెప్పకూడదు. ఒకవేళ చెప్తే మీకు ఎలాంటి ప్రయోజనం దక్కదు.

ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన కలలు కంటుంటారు. ఇది చాలా సహజం. అయితే కలలో కనిపించిన విషయాలను కొందరు పక్కన పెట్టేస్తే.. ఇంకొంతమంది మాత్రం వాటివల్ల ఏం జరుగుతుందోనని కంగారు పడిపోతుంటారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మనకు పడే కలలు మన భవిష్యత్తుకు సంకేతాలు. ఇవి మనకు శుభం జరుగుతుందా? అశుభం జరుగుతుందా అనే విషయాలను వెళ్లడిస్తాయని నమ్ముతారు. అయితే కొన్ని కలలు డబ్బుకు సంబంధించిన కూడా ఉన్నాయి. ఇలాంటి కలలను ఎవరితోనూ పంచుకోడదని డ్రీమ్ సైన్స్ చెబుతోంది. ఎందుకంటే ఇలాంటి కలలను ఇతరులతో పంచుకోవడం వల్ల మీరు ఆ ప్రయోజనాన్ని పొందలేరు. మరి ఎలాంటి కలలను ఇతరులతో పంచుకోకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

చావు గురించి కలలు 

మనకు దగ్గరైన వారు లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు చనిపోయినట్టుగా కూడా అపుడప్పుడు కలలు వస్తుంటాయి. ఇలాంటి కలలు కని భయపడిపోయే వారు చాలా మందే ఉన్నారు. వీటిని కొంతమంది అశుభంగా భావిస్తారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఇలాంటి కలలకు భయపడాల్సిన పని లేదు. డ్రీమ్ సైన్స్ లో ఇలాంటి కలలను శుభప్రదంగా భావిస్తారు. ఒకవేళ మీకు కూడా ఇలాంటి కలలు పడితే మీ కలలో చనిపోయిన వ్యక్తి చాలా రోజులు బతుకుతాడని అర్థం చేసుకోండి. ఇది దీర్ఘాయుష్షును సూచిస్తుంది. అయితే ఇలాంటి కలలను పొరపాటున కూడా ఇతరులతో పంచుకోకూడదు. దీనివల్ల మీ ఆనందం మటుమాయం అవుతుంది. 


ఈ కల చెబితే పురోగతి ఆగిపోతుంది

డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మీ కలలో మీరు మీ తల్లిదండ్రులకు నీటిని అందిస్తున్నట్టు వస్తే మీ భవిష్యత్తు మెరుగుపడుతుందని అర్థం. ఇవి శుభ సంకేతం కూడా. ఇది మీరు ఫ్యూచర్ లో విజయాన్ని సాధిస్తారని అర్థం. ఈ కలలను కూడా మీరు ఇతరులతో పంచుకోకూడదు. దీనివల్ల మీ పురోగతికి ఆటంకం కలుగుతుంది.
 

కలలో దేవతల దర్శనాలు

డ్రీమ్ సైన్స్ ప్రకారం.. చాలా మందికి దేవతల దర్శనం కలుగుతుంది. ఇది శుభప్రదమని డ్రీమ్ సైన్స్ లో నమ్ముతారు. మీరు ఇలాంటి కలలను కంటే భవిష్యత్తులో మీకు పెద్ద అవకాశం లభించబోతుందని అర్థం. ఇలాంటి కలలను కూడా ఎవరికీ చెప్పకండి. ఒకవేళ చెప్తే మీకు భవిష్యత్తులో వచ్చే శుభావకాశాన్ని కోల్పోతారు.

Latest Videos

click me!