వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలను పొరపాటున కూడా పెంచొద్దు

First Published | Jul 31, 2024, 2:21 PM IST

ప్రతి ఒక్కరూ ఇంటిని అందంగా మార్చడానికి వివిద రకాల చెట్లను నాటుతుంటారు. ఇంట్లో చెట్లను, మొక్కలను నాటితో పాజిటివ్ ఎనర్జీ ప్రవాహిస్తుంది. కానీ వాస్తు ప్రకారం.. కొన్ని మొక్కలు మీకు ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. అందుకే ఇంట్లో  ఎలాంటి మొక్కలను పెంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ఇంట్లో చెట్లను పెంచడం మంచిదని అందరూ భావిస్తారు. ప్రస్తుత కాలంలో ఇండోర్ ప్లాంట్లను పెంచే ట్రెండ్ కూడా బాగా పెరిగిపోయింది. కానీ కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే ఇవి శుభప్రదంగా పరిగణించబడవు. ఇంట్లో ఈ మొక్కలను నాటితే మీ జీవితంలో సమస్యలు పెరుగుతాయి. ఎందుకంటే ఈ మొక్కలు ప్రతికూల శక్తిని ప్రసారం చేస్తాయి. ఇది కుటుంబ సభ్యుల స్థితిని ప్రభావితం చేస్తుంది. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఎలాంటి మొక్కలను పెంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

vastu tips cactus

ముళ్ల మొక్కలు

ఈ రోజుల్లో ఇళ్లలో కూడా కాక్టస్ మొక్కలను బాగా పెంచుతున్నారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి లోపల ముళ్ల మొక్కలను ఎప్పుడూ పెట్టకూడదు. కాబట్టి ఇంట్లో గులాబీ మొక్కలను కూడా పెంచకండి. అలాగే బోన్సాయ్ మొక్కను కూడా ఇంటి లోపల పెట్టకండి. లేదంటే కుటుంబ సభ్యుల పురోగతికి ఆటంకం ఏర్పడుతుంది.
 


ఈ మొక్కలు అశుభమైనవి.

వాస్తు శాస్త్రం ప్రకారం.. గోరింటాకు మొక్కను కూడా ఇంట్లో దగ్గర పెట్టకూడదు. ఎందుకంటే ఈ మొక్కలో ప్రతికూల శక్తులు నివసిస్తాయని నమ్ముతారు. అలాగే ఇంటి దగ్గర చింత చెట్టును కూడా పెంచకూడదంటారు. ఎందుకంటే దీన్ని అశుభంగా భావిస్తారు.
 

ఇంట్లో శుభప్రదమైన మొక్కలను నాటేటప్పుడు అవి ఎండిపోకుండా చూసుకోండి. ఏదైనా ఒక మొక్క ఎండిపోతే దాన్ని వెంటనే తొలగించండి. లేకపోతే అది మీ ఇంట్లో నెగిటివిటీ వ్యాప్తి చెందడం ప్రారంభిస్తుంది. అలాగే పాలను ఉత్పత్తి చేసే మొక్కలను కూడా ఇంట్లో నాటకూడదు. అలాంటి మొక్కలను అశుభంగా భావిస్తారు.

Latest Videos

click me!