ఈ తేదీల్లో పుట్టిన వారితో జాగ్రత్త... పార్ట్ నరే మోసం చేసేస్తారు..!

First Published | Jul 30, 2024, 5:11 PM IST

న్యూమరాలజీ ప్రకారం తమ జీవిత భాగస్వామిని మోసం చేసే వారు కూడా ఉన్నవారు. వారెవరో ఓసారి చూద్దాం...
 

People born on these dates cheat on their spouses


న్యూమరాలజీ ప్రకారం  ఒక వ్యక్తి ప్రవర్తన, భవిష్యత్తు గురించి మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రపంచంలో  ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ గా ఉండరు. ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు.కొందరు చాలా మంచివారు ఉంటారు.. మరి కొందరు చాలా చెడ్డవారు కూడా ఉంటారు.   కొందరు ఇతరులను మోసం చేస్తూ ఉంటారు. తోడబుట్టిన వారిని మోసం చేసేవారు కొందరైతే కట్టుకున్న భార్య లేదంటే భర్తను మోసం చేసేవారు కూడా ఉంటారు. న్యూమరాలజీ ప్రకారం తమ జీవిత భాగస్వామిని మోసం చేసే వారు కూడా ఉన్నవారు. వారెవరో ఓసారి చూద్దాం...


సంఖ్య 6 : నెలలో 6, 15 , 24 తేదీలలో జన్మించిన వ్యక్తులు ఈ సంఖ్యను కలిగి ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా దయగా ఉంటారు.  వీరు  తమ భాగస్వామికి ఎక్కువ శ్రద్ధ ఇస్తారు . కానీ వారు ఇతరుల భావోద్వేగ అవసరాలను కూడా తీరుస్తారు. అందుకే వారు తమ భావాలను పంచుకుంటారు. అంటే.. ఈ తేదీల్లో పుట్టినవారు.. అక్రమ సంబంధాలు పెట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. 


సంఖ్య 3 : ఈ సంఖ్య ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారికి వర్తిస్తుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి మంచి హృదయం ఉంటుంది.  ఇతరులను సులభంగా ఆకర్షించగలరు. ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు.అయితే.. ఈ తేదీల్లో పుట్టిన వారు కూడా.. మరొకరితో సంబంధం పెట్టుకొని తమ భాగస్వామిని మోసం చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.


సంఖ్య 5 : అన్ని నెలల్లో 5, 14 లేదా 23వ తేదీల్లో పుట్టిన వారు ఈ సంఖ్యతో పుడతారు. తరచుగా సాహసోపేతంగా ఉంటారు.  వారు ఎప్పుడూ కొత్త అనుభవాల కోసం వెతుకుతూ ఉంటారు. ఎంత మంచి భాగస్వామి లభించినా.. వారి చూపు.. కొత్తవారి కోసం వెతుకుతూ ఉంటుంది. ఫలితంగా.. అక్రమ సంబంధాలకు దారి తీయవచ్చు.

సంఖ్య 8 : ఈ నెల 8, 17 , 26 తేదీల్లో పుట్టిన వారికి ఈ సంఖ్య వర్తిస్తుంది. వారికి విజయం, శక్తి  ప్రేరణ కోసం కోరిక ఉంటుంది. ఈ ప్రేరణ కారణంగా, వారు వివాహం , సంబంధాల సరిహద్దులను దాటి ఆలోచిస్తారు. వీరు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి.

సంఖ్య 9 : ఈ నెల 9, 18 , 27 తేదీల్లో జన్మించిన వారికి ఈ సంఖ్య వర్తిస్తుంది. వీరు చాలా శ్రద్ధగల వ్యక్తులు. సంబంధం విషయానికి వస్తే ఆదర్శ వ్యక్తులు. కానీ వారు జీవిత భాగస్వాములతో కాకుండా ఇతరులతో సంబంధాలు కలిగి ఉండవచ్చు. భావోద్వేగ సంబంధాన్ని కోరుకుంటారు.

Latest Videos

click me!