ఎవరికైనా బహుమతి ఎందుకు ఇస్తాం..? వారిపై మనకు ఉన్న ప్రేమను తెలియజేయడానికి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం. అంతేకాదు.. మనం ఇచ్చే బహుమతి వారికి నచ్చాలని.. ఏది పడితే అది కాకుండా.. వారికి ఉపయోగపడేది ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం. ఎక్కువ మంది.. ఇంట్లోకి ఉపయోగపడేవి ఇస్తూ ఉంటారు. కానీ...జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను పొరపాటున కూడా గిఫ్ట్స్ గా ఇవ్వకూడదట. అలా ఇవ్వడం వల్ల.. వారికి జరిగే మంచి పక్కన పెడితే.. మీకు చెడు జరిగే ప్రమాదం ఉంది. అవును.. జోతిష్యం ప్రకారం.. ఈ కింది వస్తువులను పొరపాటున కూడా ఎవరికీ ఇవ్వకండి. బహుమతి అందుకున్న వారికంటే.. ఇచ్చినవారిపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందట. మరి ఎలాంటివి ఇవ్వకూడదో తెలుసుకోండి.
1.గడియారం..
చాలా మంది ఎక్కువ మందికి కామన్ గా ఇచ్చే బహుమతిలో గడియారం. కానీ.. పొరపాటున కూడా గడియారం ని బహుమతిగా మీ బంధువులకే కాదు. ఫ్రెండ్స్ ఎవరికీ ఇవ్వకూడదు. దీని వల్ల.. తీసుకున్నవారికి ఏమీ కాదు.. కానీ.. మీ టైమ్ బ్యాడ్ అవుతుందట. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి
magic mirror
2.మిర్రర్...
ఈ రోజుల్లో మిర్రర్స్ కూడా మంచి గిఫ్ట్ ఐటెమ్స్ లా మార్కెట్లో లభిస్తున్నాయి. కానీ.. మీరు పొరపాటున కూడా ఈ అద్దాలను బహుమతిగా ఇవ్వకండి. దీని వల్ల.. మీ పాజిటివిటీ మొత్తవా వారికి వెళ్లి.. మీకు నెగిటివిటీ పెరుగుతుంది.
3.అక్వేరియం..
ఇవి మాత్రమే.. వాటర్ తో సంబంధం ఉండే అవ్వేరియం లాంటి వస్తువులను పొరపాటున కూడా ఎవరికీ బహుమతిగా ఉండకూడదు. ఎందుకంటే నీటికి సంబంధించిన అక్వేరియం లాంటివి బహుమతిగా ఇవ్వడం వల్ల... మీ కర్మ,ఐశ్వర్యం అంతా వారికి ఇచ్చినవారు అవుతారట.
4.పదునైన వస్తువులు..
పదునైన వస్తువులు అంటే చాకు, కత్తెర లాంటివి కూడా పొరపాటున కూడా ఎవరకీ బహుమతిగా ఇవ్వకండి. ఎందుకంటే ఇవి బ్యాడ్ లక్ కి సంకేతంగా భావిస్తారు. ఇలాంటివి బహుమతిగా ఇవ్వడం వల్ల... ఇచ్చిన వారికీ మంచిది కాదు.. తీసుకున్నవారికి సైతం మంచిది కాదట.
5.రెడ్ అండ్ బ్లాక్..
జోతిష్యశాస్త్రం ప్రకారం ఎవరికీ పొరపాటున కూడా నలుపు రంగు వస్తువులు బహుమతిగా ఇవ్వకూడదు. ఇది చావుకు సంబంధించినది గా భావిస్తారు. అంతేకాదు... ఏదైనా పుస్తకం బహుమతిగా ఇస్తున్నట్లయితే.. రెడ్ కలర్ కవర్ ఉన్న బుక్స్ ఇవ్వకూడదు. ఇది మీ బంధాన్ని దూరం చేస్తుంది. మిమ్మల్ని ఆ బహుమతి అందుకున్న వ్యక్తి అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
6.వ్యాలెట్..
చాలా మంది ఈ పొరపాటు చేస్తూ ఉంటారు. తమ ఫ్రెండ్స్ కి వ్యాలెట్ ఇస్తూ ఉంటారు. వారు డబ్బు దాచుకోవడానికి ఉంటుందని వారు భావిస్తారు. కానీ... అలా ఇవ్వకూడదట. ఎందుకంటే.. మీరు ఎవరికైనా వ్యాలెట్ ఇస్తున్నారు అంటే... వారికి.. మీ ఫైనాన్షియల్ ఎనర్జీ మొత్తం వారికి ట్రాన్సఫర్ చేసిన వారు అవుతారు. అది మీకే ఎక్కువ నష్టం కలిగిస్తుంది.
heels
7.చెప్పులు..
మీరు ఎవరికైనా చెప్పులు, హీల్స్, షూస్ లాంటివి బహుమతిగా ఇవ్వకూడదు. దానిని ఇవ్వడం వల్ల.. వాటిని అందుకున్న వ్యక్తి.. మీకు మీ జీవితం నుంచి దూరమైపోతాడు.