Zodiac Signs: దీపావళి నాడు బుధ, కుజ గ్రహాల కలయిక.. ఈ 3 రాశులకు రాజయోగమే!

Published : Oct 14, 2025, 02:34 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ దీపావళి పండుగ నాడు 2 శక్తివంతమైన గ్రహాలు ఒకే రాశిలో కలవనున్నాయి. దానివల్ల కొన్ని రాశులవారికి అదృష్టం కలిసిరానుంది. చీకటిని తొలగించి వెలుగును ఆహ్వానించే పర్వదినాన ఈ గ్రహాల కలయిక 3 రాశులవారి జీవితాల్లో కొత్త ఆశలు నింపనుంది 

PREV
14
బుధ, కుజ గ్రహాల కలయిక

ఈ ఏడాది దీపావళి నాడు ముఖ్యమైన గ్రహాలు రాశులు మారనున్నాయి. దానివల్ల శుభయోగాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా బుద్ధి, కమ్యూనికేషన్‌ వంటి వాటికి కారకుడైన బుధ గ్రహం.. శక్తి, ఉత్సాహం, పోరాటశక్తిని సూచించే కుజ గ్రహం.. తులరాశిలో కలవనున్నాయి. ఈ రెండు గ్రహాల కలయిక దీపావళి పండుగ సమయంలో జరగడం వల్ల కొన్ని రాశులవారికి అదృష్టం కలిసివస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాశులేంటో? వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం. 

24
కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి బుధ, కుజ సంయోగం సానుకూలంగా ఉంటుంది. ఈ కలయిక కర్కాటక రాశి నాల్గవ ఇంట్లో ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమయంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఈ రాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తుంది. చేపట్టిన పనిలో విజయం, ప్రశంసలు దక్కుతాయి. కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి. బంధాలు బలపడతాయి. పూర్వీకుల నుంచి ఆస్తి లాభాలు కలగవచ్చు.

34
కన్య రాశి

కన్య రాశి వారికి బుధ, కుజ సంయోగం శుభప్రదం. ఈ కలయిక కన్య రాశిలో ధన, వాక్కు స్థానంలో జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి. బంధువులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. 

44
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి బుధ, కుజ సంయోగం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కలయిక ధనుస్సు రాశి 11వ ఇంట్లో ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమయంలో ఈ రాశివారి ఆదాయం బాగా పెరుగుతుంది. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాల వర్షం కురుస్తుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. షేర్ మార్కెట్, లాటరీ వంటి వాటినుంచి కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories