Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!

Published : Apr 08, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 08.04.2026 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పాత మిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

313
వృషభ రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. విద్యార్థుల ఫలితాలు సంతృప్తినిస్తాయి.

413
మిథున రాశి ఫలాలు

కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.

513
కర్కాటక రాశి ఫలాలు

పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలహా సూచనలు ఉన్నాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

613
సింహ రాశి ఫలాలు

ఇంట్లో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఆశించిన ట్రాన్స్ ఫర్ లు ఉంటాయి.

713
కన్య రాశి ఫలాలు

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తికావు. ముఖ్యమైన వ్యవహారాలలో నమ్మినవారే మోసగిస్తారు. వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

813
తుల రాశి ఫలాలు

సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగాల్లో జాప్యం కలిగినా పెద్దగా ఇబ్బంది ఉండదు. విద్యార్థులు మరింత కష్టపడాలి.

913
వృశ్చిక రాశి ఫలాలు

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఉద్యోగులు పై అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

1113
మకర రాశి ఫలాలు

బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవరపెడతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

1213
కుంభ రాశి ఫలాలు

ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంలో ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

1313
మీన రాశి ఫలాలు

ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తికావు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఇంటా బయటా వివాదాలు తప్పవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసిరావు.

Read more Photos on
click me!

Recommended Stories