Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం చేస్తారు!

Published : Aug 07, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 07.08.2026 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందడంలో ఆలస్యం అవుతుంది. ఉద్యోగులకు పనిభారం తప్పదు.

313
వృషభ రాశి ఫలాలు

దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం అంతగా కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు తప్పవు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.

413
మిథున రాశి ఫలాలు

నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంట్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.

513
కర్కాటక రాశి ఫలాలు

రుణదాతల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయటా అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆలయ దర్శనాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి.

613
సింహ రాశి ఫలాలు

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభకార్యాలకు ఆహ్వనాలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి శుభవార్తలు అందుతాయి.

713
కన్య రాశి ఫలాలు

వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. భూ వివాదాలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు విఫలమవుతాయి.

813
తుల రాశి ఫలాలు

కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుంది. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు

శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు

కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. స్నేహితులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగాలలో మార్పులుంటాయి.

1113
మకర రాశి ఫలాలు

ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తప్పవు. స్థిరాస్తి విషయంలో సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు.

1213
కుంభ రాశి ఫలాలు

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

1313
మీన రాశి ఫలాలు

నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు పొందుతారు.

Read more Photos on
click me!

Recommended Stories