Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది!

Published : Aug 31, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 31.08.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.

313
వృషభ రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన రుణాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

413
మిథున రాశి ఫలాలు

శ్రమతో కానీ పనులు పూర్తి కావు. దూరపు బంధువుల నుంచి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.

513
కర్కాటక రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ ఫలించదు. బంధువులతో వివాదాలు తప్పవు. మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

613
సింహ రాశి ఫలాలు

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.

713
కన్య రాశి ఫలాలు

వ్యాపార, ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

813
తుల రాశి ఫలాలు

ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయటా ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

913
వృశ్చిక రాశి ఫలాలు

రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలను పంచుకుంటారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

దైవ చింతన పెరుగుతుంది. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ముఖ్యమైన పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.

1113
మకర రాశి ఫలాలు

వ్యాపార వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

1213
కుంభ రాశి ఫలాలు

నూతన వాహన యోగం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో నూతన ఆశలు చిగురిస్తాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

1313
మీన రాశి ఫలాలు

నూతన వాహన యోగం ఉంది. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories