Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి గృహ, వాహన యోగం.. నిరుద్యోగులకు ఉద్యోగం!

Published : Feb 03, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 03.02.2026 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలలో ఆర్థిక లబ్ది కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

313
వృషభ రాశి ఫలాలు

చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన ప్రయత్నాలు అంతగా కలిసిరావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృథా ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాలలో అధికారులతో చికాకులు కలుగుతాయి. 

413
మిథున రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.

513
కర్కాటక రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగులకు ఒత్తిడి పెరిగి చికాకులు అధికమవుతాయి. ఇంటా బయటా ప్రతికూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు శ్రమతో కూడి ఉంటాయి. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

613
సింహ రాశి ఫలాలు

వ్యాపార, ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి.

713
కన్య రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో పై అధికారులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. 

813
తుల రాశి ఫలాలు

వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయటా సమస్యలు అధికమవుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగులకు పనిభారం తప్పదు.

913
వృశ్చిక రాశి ఫలాలు

వ్యాపార వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి. కుటుంబ విషయాల్లో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ఇంట్లో విందు వినోదాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతగా వ్యవహరించి ఉన్నత పదవులు పొందుతారు.

1113
మకర రాశి ఫలాలు

నూతన గృహ, వాహన యోగం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది. బంధుమిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి, వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో అంచనాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.

1213
కుంభ రాశి ఫలాలు

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశ కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి.

1313
మీన రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనల వల్ల వివాదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కొత్త అప్పులు చేయకపోవడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories