Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి!

Published : Sep 28, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 28.09.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆసక్తికర సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.

313
వృషభ రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. దైవ దర్శనాలు చేసుకుంటారు. డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. సంతాన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

413
మిథున రాశి ఫలాలు

బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన వాహన యోగం ఉంది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. కీలక సమయంలో సొంత ఆలోచనలు కలసివస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు.

613
సింహ రాశి ఫలాలు

వ్యాపార, ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృథా ఖర్చులు అదుపు చేయడం మంచిది.

713
కన్య రాశి ఫలాలు

కుటుంబంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్నిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది.

813
తుల రాశి ఫలాలు

వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. శ్రమతో కానీ పనులు పూర్తి కావు.

913
వృశ్చిక రాశి ఫలాలు

ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు డబ్బు సహాయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

1113
మకర రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు.

1213
కుంభ రాశి ఫలాలు

వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో శ్రమ తప్పదు.

1313
మీన రాశి ఫలాలు

దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కీలక సమయంలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories