Today Rasi Phalalu: నేడు ఈ రాశులవారు కొన్ని విషయాల్లో పెద్దల సలహా తీసుకోవడం మంచిది!

Published : Sep 27, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 27.09.2026 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఈ రోజు ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి మంచి సమయం. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

313
వృషభ రాశి ఫలాలు

ఆర్థిక విషయాల్లో అనుకూలమైన ఆలోచనలు కలుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. స్నేహితులతో ముఖ్యమైన విషయాలు చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాలలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కొన్ని విషయాల్లో వెంటనే స్పందించకుండా ఆలోచించడం మంచిది.

413
మిథున రాశి ఫలాలు

కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ఆలోచనలకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం ఆనందాన్ని ఇస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

513
కర్కాటక రాశి ఫలాలు

ఈ రోజు కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మీ దృష్టిని ఆకర్షిస్తుంది. పెద్దల సలహా ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సాధారణ పరిస్థితి ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థంగా నిర్వహిస్తారు. కొన్ని విషయాల్లో ప్రశాంతంగా ఆలోచించడం మంచిది.

613
సింహ రాశి ఫలాలు

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలాకాలంగా వాయిదా పడుతున్న పనిని పూర్తి చేసే అవకాశం ఉంది. ఉద్యోగాలలో ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కొత్త పరిచయాలు ఉపయోగపడవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం కోసం తగిన విశ్రాంతి అవసరం.

713
కన్య రాశి ఫలాలు

ప్రణాళిక ప్రకారం పనులను పూర్తి చేసి మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీల్లో కొన్ని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి. కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త నిర్ణయం తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది.

813
తుల రాశి ఫలాలు

బంధువులతో సంబంధాలు బలపడతాయి. కుటుంబ విషయాలు అనుకూలంగా సాగుతాయి. స్నేహితుల నుంచి ఉపయోగకరమైన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యత రావచ్చు. ఆర్థికంగా అవసరమైన ఖర్చులు చేయడం మంచిది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

ఈ రోజు పట్టుదలతో ఒక ముఖ్యమైన పనిని ముందుకు తీసుకెళ్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో కొత్త ఆలోచనలు వస్తాయి. కుటుంబ సభ్యులకు మీ సహాయం అవసరం కావచ్చు. డబ్బు విషయంలో ఇతరులకు హామీ ఇవ్వడం మంచిది కాదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

1013
ధనుస్సు రాశి ఫలాలు

కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొన్ని పరిచయాల ద్వారా అవకాశం రావచ్చు. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ముఖ్యమైన పనులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.

1113
మకర రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మీ పనితీరును ఇతరులు గమనించే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక శుభవార్త వింటారు. పెట్టుబడులు లేదా పెద్ద కొనుగోళ్ల విషయంలో తొందరపాటు మంచిదికాదు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

1213
కుంభ రాశి ఫలాలు

ఆలోచనా విధానంలో కొత్తదనం కనిపిస్తుంది. కొత్త ప్రణాళికకు శ్రీకారం చుడతారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో మీ మాటకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థికంగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి.

1313
మీన రాశి ఫలాలు

ముఖ్యమైన విషయాల్లో ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయం గడుపుతారు. ఉద్యోగంలో పెండింగ్ పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాలకు సంబంధించి ముందుగానే ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories