
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. అవసరానికి కుటుంబ సభ్యుల నుంచి డబ్బు సహాయం అందుతుంది.
ఇంటా బయటా వివాదాలు చికాకు తెప్పిస్తాయి. చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది.
అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. బంధు మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. కొత్త వ్యాపారాల ప్రారంభానికి ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
ఆత్మవిశ్వాసంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.
ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహన్నిస్తాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.
కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. డబ్బు పరంగా ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. దూర ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి.
ఇంటా బయటా ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి విమర్శలు తప్పవు.
చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు.
జీవిత భాగస్వామితో అకారణంగా వివాదాలు కలుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం వల్ల తగిన విశ్రాంతి ఉండదు.
ఆర్థికంగా పురోగతి ఉంటుంది. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణకు మిత్రుల సహాయం అందుతుంది.
ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగాల్లో తోటివారితో వివాదాలు పరిష్కారమవుతాయి.
ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తులాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. భూ సంభందిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు.