
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
నూతన వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.
ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. కష్టానికి తగిన ఫలితం దక్కదు. సోదరులతో భూ వివాదాలు కలుగుతాయి. బంధువులతో అకారణంగా వివాదాలు వస్తాయి. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు.
కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
సన్నిహితుల నుంచి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన డబ్బు సహాయం అందుతుంది. సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు సర్దుమణుగుతాయి.
రావాల్సిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగుల పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి.
పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. నిరుద్యోగుల యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు కష్టానికి తగిన ఫలితం అందదు.
చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తికావు. కొన్ని విషయాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. భూ సంబంధిత వివాదాలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.
సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.
ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలలో అవరోదాలు కలుగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ వాతావరణం చికాకు కలిగిస్తుంది.
కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. చేపట్టిన పనులలో శ్రమ అధికమవుతుంది. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.