Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగాలలో పదోన్నతులు!

Published : Aug 25, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 25.08.2026 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్త అవసరం. వ్యాపారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటా బయటా మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి.

313
వృషభ రాశి ఫలాలు

నిరుద్యోగులు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. పాత బాకీలు తీర్చుతారు. వ్యాపార విస్తరణకు పెట్టుబడులు అందుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

413
మిథున రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు కలుగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఇంటా బయటా కొత్త సమస్యలు వస్తాయి. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సన్నిహితుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

613
సింహ రాశి ఫలాలు

ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థిక వాతావరణం ఆశించిన విధంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.

713
కన్య రాశి ఫలాలు

వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.

813
తుల రాశి ఫలాలు

నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అకారణంగా వివాదాలు కలుగుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటా బయటా మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.

1113
మకర రాశి ఫలాలు

వ్యాపార, ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి. బంధువులతో విభేదాలు కలుగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. దైవ చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

1213
కుంభ రాశి ఫలాలు

వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు. వృత్తి, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.

1313
మీన రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

Read more Photos on
click me!

Recommended Stories