Zodiac Signs: జ్యోతిష్య ప్రకారం ఒక్కో రాశివారు ఒక్కో రకంగా ఉంటారు. కొందరు అవమానాన్ని తేలికగా తీసుకుంటే, ఇంకొందరు వెంటనే రియాక్ట్ అవుతారు. మరికొందరు సరైన సమయం కోసం వేచి చూసి పగ తీర్చుకుంటారు. వీళ్లు అవమానాలను అస్సలు మర్చిపోరు. ఆ రాశులేవో చూద్దామా..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వృశ్చిక రాశివారు పైకి ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ, వాళ్ల మనసులో ఏముందో అర్థం చేసుకోవడం కష్టం. వీళ్లు అవమానాలను, దెబ్బతిన్న నమ్మకాన్ని అస్సలు మర్చిపోరు. వెంటనే గొడవపడకుండా, ముందు పరిస్థితిని అర్థం చేసుకుంటారు. ఆ తర్వాతే పక్కా ప్లాన్‌తో దెబ్బకొడతారు. చాలాసార్లు వీళ్ల రియాక్షన్ గొడవ రూపంలో ఉండదు. దూరం పెడుతూనే పగ తీర్చుకుంటారు. కాబట్టి, వాళ్ల మౌనాన్ని అస్సలు బలహీనతగా అనుకోవద్దు.
25
సింహ రాశి
సింహ రాశి వారికి గౌరవం చాలా ముఖ్యం. నలుగురిలో అవమానిస్తే అస్సలు సహించలేరు. వాళ్ల ఆత్మాభిమానం దెబ్బతింటే, ఆ విషయాన్ని చాలా కాలం గుర్తు పెట్టుకుంటారు. వాదనలకు దిగడం కంటే, తమ సత్తా ఏంటో చేతల్లో చూపించాలనుకుంటారు. కొన్నిసార్లు, తమ విజయమే అవతలి వ్యక్తికి సరైన సమాధానం అని భావిస్తారు.
35
మేష రాశి
మేష రాశివారికి కోపం ముక్కు మీదే ఉంటుంది. దీనికి కారణం వీరి అధిపతి కుజుడు కావడమే. ఏదైనా తప్పు జరిగిందనిపిస్తే, వీళ్లు మౌనంగా ఉండలేరు. వాళ్ల రియాక్షన్ చాలా సూటిగా, స్పష్టంగా ఉంటుంది. తమను అవమానిస్తే, వెంటనే ప్రతీకారం తీర్చుకుంటారు. వీరికి కోపం ఎంత తొందరగా వస్తుందో, అంతే తొందరగా చల్లారుతుంది. అయినా, అనవసరంగా వీళ్లతో గొడవలు పెట్టుకోకపోవడమే మంచిదని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.
కర్కాటక రాశివారు సంబంధాలకు చాలా విలువ ఇస్తారు. అందుకే, ఇష్టమైన వాళ్లు బాధపెడితే తట్టుకోలేరు. నమ్మిన వారు మోసం చేసినా, అవమానించినా ఆ విషయాన్ని చాలా కాలం మనసులో పెట్టుకుంటారు. వీళ్ల పగ ఎప్పుడూ బయటకు కనిపించదు.సైలెంట్‌గా దూరం ఉంటూనే చేయాల్సింది చేస్తారు. వీరికి ప్రేమ, నమ్మకం, గౌరవం చాలా ముఖ్యం.
55
మకర రాశి
మకర రాశి వారు వెంటనే స్పందించకుండా, ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఎవరైనా తప్పు చేస్తే, ముందు మౌనంగా ఉండి పరిస్థితిని గమనిస్తారు. వీళ్ల రియాక్షన్ ఎమోషనల్ డ్రామాగా ఉండదు. తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవడంపై దృష్టి పెడతారు. కెరీర్‌లో ముందుకు సాగడం, విజయం సాధించడమే వీరిచ్చే బలమైన సమాధానం. వీళ్ల మౌనాన్ని బలహీనతగా భావించకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.