
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
కుటుంబంలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అంచనాలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఇతరులతో వాదనకు వెళ్లకపోవడం మంచిది.
వ్యాపార విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి ఆర్థికంగా అనుకూలం. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ అధికమవుతుంది. సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సోదరులతో కొన్ని వ్యవహారాలలో సఖ్యత లోపిస్తుంది. కుటుంబ విషయాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. స్థిరాస్తి ఒప్పందాలు కలిసిరావు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
ఊహించని ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అదనపు పని భారం వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవచింతన పెరుగుతుంది.
చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.
అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. ఇంటా బయటా ఊహించని సమస్యలు వస్తాయి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. విద్యార్థులకు పోటీ పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాలలో చేయని పనికి ఇతరుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. పాత రుణాలు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు.
బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పనిభారం తప్పదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ పెద్దల నుంచి కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.
చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. స్థిరాస్తి వివాదాలను సోదరుల సహాయంతో రాజీ చేసుకుంటారు. నిరుద్యోగులు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృత్తి, ఉద్యోగ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. వ్యాపారాలలో నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ లబ్ధి పొందుతారు.
కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుంచి సమస్యలు వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఉద్యోగాల్లో అధికారులతో వాదనలకు వెళ్లకపోవడం మంచిది. కంటి సంబంధిత సమస్యలు బాధిస్తాయి.