Money Plant Vastu: మనీ ప్లాంట్ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే డబ్బుకు లోటు ఉండదు, సుఖ సంతోషాలతో తులతూగుతారు. అయితే, కొన్ని నియమాలు కచ్చితంగా పాటించడం చాలా ముఖ్యం.
మనీ ప్లాంట్ సాధారణంగా ప్రతి ఇంట్లోనూ, పెద్ద పెద్ద షాపుల్లో కనిపిస్తుంది. వాస్తు ప్రకారం ఈ మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని, చెడు దృష్టి నుంచి ఇంటిని కాపాడుతుందని నమ్ముతారు. కానీ దీన్ని తప్పుడు దిశలో పెడితే ఆర్థిక నష్టాలు కూడా వస్తాయి.
26
ఏ దిశలో పెట్టకూడదు?
ఇంటికి ఈశాన్య దిశలో (North-East) మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ పెట్టకూడదు. ఈ దిశకు అధిపతి దేవగురువైన బృహస్పతి. కానీ మనీ ప్లాంట్‌కు అధిపతి శుక్ర గ్రహం. జ్యోతిషశాస్త్రం ప్రకారం, బృహస్పతి, శుక్రుడు ఒకరికొకరు శత్రువులు. అందుకే ఈ దిశలో మొక్క పెడితే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరిగి, కష్టాలు మొదలవుతాయి.
36
తూర్పు పడమర దిశ
ఈ దిక్కులలో మనీ ప్లాంట్ పెట్టడం కూడా మంచిది కాదు. ఇది అనవసరమైన ఖర్చులను పెంచుతుంది, ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. అంతేకాదు, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలకు కూడా కారణం కావచ్చు.
వాస్తు శాస్త్రం ప్రకారం, మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఇంటి ఆగ్నేయ దిశలో (South-East) పెట్టాలి. దీనిని 'అగ్ని కోణం' అని కూడా పిలుస్తారు. ఈ దిశకు అధిపతి గణేశుడు, గ్రహం శుక్రుడు. ఈ దిశలో మొక్క ఉంటే సుఖసంతోషాలు పెరగడమే కాకుండా, ఆర్థికంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
56
ఈ 4 విషయాలపై దృష్టి పెట్టాలి
ఆకులు ఎండిపోతుంటే, వాటిని వెంటనే తీసేయాలి. మొక్క ఆరోగ్యంగా, పచ్చగా ఉండటానికి ఎప్పటికప్పుడు నీళ్లు పోయాలి. మనీ ప్లాంట్ తీగలు వేగంగా పెరుగుతాయి కాబట్టి అవి కింద నేల మీద పాకకుండా చూసుకోవాలి. మొక్క తీగలు, ఆకులు ఎప్పుడూ పైకి పెరిగినట్లే ఉంచుకోవాలి. అప్పుడే శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.
66
నీలి రంగు గాజు సీసా
మనీ ప్లాంట్‌ను వీలైనంత వరకు 'మట్టి కుండీ' లేదా 'నీలం రంగు గాజు సీసా'లో పెట్టండి. ఇలా చేయడం వల్ల దాని వాస్తు ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయని నమ్ముతారు.