
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాల్లో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. ఆప్తులతో మాట పట్టింపులుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. పాత అప్పులు తీర్చగలుగుతారు. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహంతో ఉన్నత పదవులు పొందుతారు. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసివస్తాయి.
ఉద్యోగాలలో ఒత్తిడి ఉన్నప్పటికీ పనులు పూర్తి చేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
ఇంట్లో శుభాకార్యాల ప్రస్తావన వస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో సహోద్యోగులతో సహాయ సహకారాలు అందుతాయి.
దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం దక్కదు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపారాలలో ఊహించని సమస్యలు వస్తాయి.
నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సన్నిహితుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.
చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సంతాన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అకారణంగా వివాదాలు వస్తాయి.
ఆకస్మిక ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సన్నిహితుల ప్రవర్తన కొంత ఆశ్చర్య పరుస్తుంది. తల్లి తరపు బంధువుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు వస్తుంది. చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలిసివస్తాయి.
బంధు మిత్రులతో మాటపట్టింపులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.
నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. సన్నిహితుల నుంచి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.