Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!

Published : Sep 02, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 02.09.2026 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

313
వృషభ రాశి ఫలాలు

ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఇంట్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. పిల్లల విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి.

413
మిథున రాశి ఫలాలు

దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు.

613
సింహ రాశి ఫలాలు

నూతన వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో బంధాలు బలపడతాయి.

713
కన్య రాశి ఫలాలు

నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత వరకు అనుకూలిస్తాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి.

813
తుల రాశి ఫలాలు

స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సేవా కార్యక్రమాల కోసం డబ్బు సహాయం చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు పాటిస్తారు.

913
వృశ్చిక రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఇంటా బయటా పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ అధికమవుతుంది. ఆకస్మికంగా డబ్బు ఖర్చవుతుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పనులు చకచకా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. మీ నిర్ణయాలు అందరికి నచ్చే విధంగా ఉంటాయి. వ్యాపార భాగస్వాముల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది.

1113
మకర రాశి ఫలాలు

వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్త్ర వస్తు లాభాలు పొందుతారు.

1213
కుంభ రాశి ఫలాలు

దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విభేదాలు చికాకు పరుస్తాయి. కుటుంబంలో కొందరి మాటలు మానసికంగా బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. పాత రుణాలు తీర్చడానికి నూతన అప్పులు చేయాల్సి వస్తుంది. దైవదర్శనాలు చేసుకుంటారు.

1313
మీన రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. దైవ చింతన కలుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

Read more Photos on
click me!

Recommended Stories