Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు.. జాగ్రత్త!

Published : Jan 18, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 18.01.2025 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి.

313
వృషభ రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల ప్రవర్తన తలనొప్పి తెప్పిస్తుంది. ముఖ్యమైన పనులలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి సమస్యలు తప్పవు. మిత్రులతో కలహా సూచనలు ఉన్నాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

413
మిథున రాశి ఫలాలు

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఇబ్బందులు అధిగమించి లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసివస్తాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుంచి కీలక విషయాలు తెలుస్తాయి.

613
సింహ రాశి ఫలాలు

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. ఇంటా బయటా సమస్యలు చికాకు కలిగిస్తాయి. దైవ సంబంధిత కార్యక్రమాలలో ఆసక్తిగా పాల్గొంటారు.

713
కన్య రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు కలిగిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు వస్తాయి. పిల్లల చదువు విషయాలలో శ్రద్ధ వహించాలి.

813
తుల రాశి ఫలాలు

రాజకీయ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. సంతానానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు

వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. బంధు మిత్రుల నుంచి విమర్శలు తప్పవు.

1113
మకర రాశి ఫలాలు

ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు తప్పవు. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. బంధు మిత్రులతో కీలక వ్యవహారాలు చర్చిస్తారు.

1213
కుంభ రాశి ఫలాలు

ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి.

1313
మీన రాశి ఫలాలు

దాయాదులతో ఆస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో శ్రమ అధికమవుతుంది. ఇతరులతో అకారణంగా విభేదాలు వస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories