Mars Sun Conjunction: ఒకే రాశిలో 3 గ్రహాలు.. ఈ 3 రాశులవారికి ఊహకందని లాభాలు!

Published : Jan 17, 2026, 01:34 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రస్తుతం సూర్యుడు, శుక్రుడు మకరరాశిలో ఉన్నారు. కుజుడు కూడా మకర రాశిలోకి ప్రవేశించాడు. కుజుడు, సూర్యుడి కలయిక వల్ల మంగళ ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది 3 రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. వీరు ఊహించని లాభాలు పొందుతారు.   

PREV
14
మంగళ ఆదిత్య రాజయోగం

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఒక గ్రహం రాశి మారినప్పుడల్లా, దాని ప్రభావం వ్యక్తులపై పడుతుంది. గ్రహాలకు అధిపతి అయిన కుజుడు ప్రస్తుతం మకరరాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే సూర్యుడు, శుక్రుడు కూడా మకరరాశిలో ఉన్నారు. అయితే కుజుడు, సూర్యుడి కలయిక మంగళ ఆదిత్య రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఈ రాజయోగం ధైర్యం, నాయకత్వం, విజయం, గౌరవం, వృత్తి పురోగతికి సంకేతం. ఈ రాజయోగం వల్ల 3 రాశులవారు శుభ ఫలితాలు పొందుతారు. ఆ రాశులేంటో చూద్దామా..

24
మిథున రాశి

మిథున రాశి వారికి కుజుడు 8వ ఇంట్లో ఉంటాడు. మంగళ ఆదిత్య రాజయోగం వీరి జీవితంలో ఆకస్మిక సానుకూల మార్పులను తెస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో మెరుగుదల కనిపిస్తుంది. పెట్టుబడులు, పరిశోధన, రహస్య ఒప్పందాల ద్వారా లాభాలు పొందే యోగం ఉంది. కాస్త ఓపికతో ముందుకు సాగితే ఈ కాలం మిథున రాశివారికి మార్గదర్శకంగా మారుతుంది.

34
సింహ రాశి

సింహ రాశి వారికి ఈ యోగం 6వ ఇంట్లో ఏర్పడుతుంది. మంగళ ఆదిత్య రాజయోగ ప్రభావం ఈ రాశివారి శత్రువులను బలహీనపరుస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు పోటీ పరీక్షల్లో సక్సెస్, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ఈ రాశికి అధిపతి సూర్యుడు కావడం, కుజుడు శక్తిని ఇవ్వడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గతంలో ఎదురైన అడ్డంకులు తొలగి, శ్రమకు తగిన గుర్తింపు పొందే అవకాశం బలంగా ఉంది. 

44
తుల రాశి

తుల రాశి వారికి మంగళ ఆదిత్య రాజయోగం 4వ ఇంటిపై ప్రభావం చూపుతుంది. కుటుంబ సంతోషం, ఆస్తి, వాహనాలకు సంబంధించిన ప్రయోజనాలు కలుగుతాయి. శుక్రుడు తుల రాశి అధిపతి కావడం వల్ల కుటుంబంలో ఆనందం, మానసిక స్థిరత్వం పెరుగుతాయి. దీర్ఘకాల భద్రతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు ఇది మంచి సమయం. ముఖ్యంగా ఇల్లు లేదా స్థిరాస్తుల విషయంలో అనుకూల ఫలితాలు పొందే అవకాశం బలంగా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories